మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషులతో సమానంగా వారితో కలిసి వారు చేసే పనులను మహిళలు సైతం చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. సాధారణంగా ఉద్యోగాలు అన్నింటిలోకి కష్టమైన ఉద్యోగం స్నేక్ క్యాచింగ్. ఇందులో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోతాయి. అయితే, కొంతమంది ఇలాంటి రిస్క్ ఉద్యోగాలను కూడా చాలా ఇష్టంగా చేస్తుంటారు. విజయాలు సాధిస్తుంటారు. ఇలాంటి వారిలో రోహిణి కూడా ఒకరు.
Read: కరుగుతున్న గ్రీన్‌లాండ్… ఇలానే కొనసాగితే ప్రపంచం…
కేరళకు చెందిన రోహిణి అటవీశాఖలో ఉద్యోగిణిగా పనిచేస్తున్నది. ఉద్యోగంతో పాటు రోహిణి స్నేక్ క్యాచింగ్‌లో శిక్షణ పొందింది. తాను నివశించే చుట్టుపక్కల ప్రాంతాల్లో పాములు కనిపిస్తే వాటిని పట్టుకొని అడవిలో విదిలేస్తుంటుంది. కట్టక్కడ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి విషసర్పం కోబ్రా రావడం గమనించిన ప్రజలు వెంటనే రోహిణీకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రోహిణీ రిస్క్యూ హుక్, ఓ చిన్న బ్యాగ్ సహాయంతో కోబ్రాను పట్టుకున్నది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారిణి సుధా రామన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A brave Forest staff Roshini rescues a snake from the human habitations at Kattakada. She is trained in handling snakes.
— Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) February 3, 2022
Women force in Forest depts across the country is growing up in good numbers. VC @jishasurya pic.twitter.com/TlH9oI2KrH