భారత్‌లో కరోనా కేసులు సంఖ్య 3 లక్షలను దాటేసి.. మళ్లీ కిందకు దిగుతోంది.. తాజాగా 2.34 లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి.. కేసులు కాస్త తగ్గినా మరికొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగానే నమోదు అవుతున్నాయి.. అందులో కేరళ రాష్ట్రం ఒకటి.. తాజాగా 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది ఆ రాష్ట్రం.. మిగతా రాష్ట్రాలు.. లాక్‌డౌన్‌ను ఎత్తివేసి.. నైట్ కర్ఫ్యూకే పరిమితం అవుతున్నాయి.. మరికొన్ని రాష్ట్రాల్లో అదికూడా లేదు.. కానీ, కేసుల దృష్ట్యా.. వీకెండ్ లాక్‌డౌన్‌ను కొనసాగిస్తోంది కేరళ.
Read Also: భారత్ కోవిడ్ అప్‌డేట్.. తాజా కేసులు ఎన్నంటే..?
జనవరి 23 మాదిరిగానే, ఇవాళ కూడా రాష్ట్రంలో లాక్‌డౌన్ లాంటి ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.. ముఖ్యమైన ప్రయాణాలపై సడలింపులు ఇచ్చారు.. వివాహాలు మరియు అంత్యక్రియలలో గరిష్టంగా 20 మంది వ్యక్తులకు అనుమతి ఉంది. అత్యవసర వాహనాల మరమ్మతుల కోసం వర్క్‌షాప్‌లు తెరవడానికి అనుమతించబడతాయి. ఇక, పర్యాటకులు హోటల్/రిసార్ట్ యొక్క స్టే వోచర్లతో ప్రయాణించడానికి అనుమతించబడతారు. కార్మికులు కంపెనీ ఐడీ కార్డులు చూపిస్తేనే కార్యాలయానికి వెళ్లడానికి అనుమతించబడతారు. మరోవైపు, పరీక్షా కేంద్రాలకు హాల్ టిక్కెట్లతో ప్రయాణానికి అనుమతించబడతారు. సుదూర ప్రయాణీకుల కోసం బస్సు/రైలు/విమాన టిక్కెట్ల బుకింగ్ సెంటర్లు ఉదయం 7 నుండి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంటాయి.. కిరాణా, కూరగాయలు మరియు పండ్లు విక్రయించే దుకాణాలు, పాలు మరియు పాల ఉత్పత్తులు, మాంసం షాపులు, ఇ-కామర్స్ సర్వీసులకు అనుమతి ఉంటుంది.