సమాజంలో ఆడవారికి రక్షణ లేదు.. ఏ రంగంలో అడుగుపెట్టినా వారికి మృగాళ్ల కామచూపుల నుంచి విముక్తి ఉండడం లేదు. తాజాగా ఒక మలయాళ దర్శకుడు.. తన వద్ద పనిచేసే మహిళను అత్యాచారం చేసి అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటన కేరళలో సంచలనం సృష్టిస్తోంది. మళ్ళీవుడు దర్శకుడు లిజు కృష్ణను నిన్న పోలీసులు అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా సెట్ లో పనిచేసే ఒక మహిళను ప్రేమ, పెళ్లి అనే మాటలు చెప్పి నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు.
ఇక కొన్నిరోజుల నుంచి ఆమె పెళ్లి పేరు ఎత్తుతుంటే మాట్లాడంలేదని, దీంతో తాను మోసపోయానని గుర్తించి కేరళలోని కన్నూర్ జిల్లాలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసి నేడు కొచ్చిలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పడవెట్టు సినిమాతో లిజు కృష్ణ మలయాళ చిత్రపరిశ్రమలోకి అరంగేట్రం చేస్తున్నాడు.ఇంకా సినిమా షూటింగ్ దశలోనే ఉండడం.. ఇప్పుడు డైరెక్టర్ అరెస్ట్ కావడంతో ఈ సినిమా అటకెక్కింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.