దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాలకు సంబంధించి ఐఎండీ రెడ్ అలెర్ట్ కూడా ప్రకటించింది. ముంబై నగరంతో పాటు మహారాష్ట్రలోని చాలా జిల్లాల్లో పలు గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, ముంబై, థానే, పాల్‌ఘర్‌లలో శుక్రవారం అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. దక్షిణ కన్నడ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జులై 8, 9 తేదీల్లో అన్ని విద్యాసంస్థలకు అధికార యంత్రాంగం సెలవు ప్రకటించింది. భారీ వర్షపాతం హెచ్చరికల జారీతో ప్రజలు బీచ్‌లను సందర్శించడాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిషేధించింది. రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) 17 బృందాలను ముంబై, థానే తదితర ప్రాంతాల్లో మోహరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.
Cock Fights: హైదరాబాద్‌లో కోడిపందాలు.. పరారీలో చింతమనేని..!
కేరళకు ఎల్లో అలర్ట్: కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల పలు నదుల నీటిమట్టం పెరిగింది. కేరళలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన హెచ్చరికలు ఉన్నాయని సీఎంవో ప్రకటన విడుదల చేసింది. అందువల్ల తిరువనంతపురం, కొల్లాం మినహా అన్ని జిల్లాల్లో నేడు, రేపు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కేంద్ర వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.అయితే మెట్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉత్తర కేరళలో కదలుండి (మలాపురం), భరతపూజ (పాలకాడ్), షిరియా (కాసర్‌గోడ్), కరవన్నూరు (త్రిస్సూర్), గాయత్రి (త్రిస్సూర్) నదుల నీటిమట్టం పెరిగింది. దీనితో పాటు దక్షిణ కేరళలోని వామనపురం (తిరువనంతపురం), నెయ్యర్ (తిరువనంతపురం), కరమణ (తిరువనంతపురం), కల్లడ (కొల్లం), మణిమాల (ఇడుక్కి), మీనాచిల్ (కొట్టాయం), కొత్తమంగళం (ఎరనాకులం) నదుల్లో కూడా నీటి మట్టం పెరుగుతోంది. కేరళలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల హెచ్చరికల ఆధారంగా వివిధ జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ఆరెంజ్ అలర్ట్: హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాబోయే రెండు రోజుల పాటు కాంగ్రా, మండి, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సిమ్లా, బిలాస్‌పూర్, హమీర్‌పూర్, ఉనా జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
SBI: అలర్ట్.. మీరు ఈ పని చేయకపోతే మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్..!
తెలుగు రాష్ట్రాల్లో..: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 8,11 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, ఈ నెల 9న తెలంగాణలో అతి భారీ వర్షం నమోదవుతుందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురువనున్నాయి. రాగల ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా ఈ నెల 8, 11 తేదీల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.