Angry Husband: బ్రష్ చేయకుండా ముద్దులు.. అడ్డుకున్న భార్యను చంపేసిన భర్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలకాలం తోడుగా ఉంటానని, కంటికి రెప్పలా చూసుకుంటానని పెళ్లి చేసుకున్న భర్తే ఆమె పాలిట యముడిలా మారాడు. కొడుకుని ముద్దు పెట్టుకోవడాన్ని అడ్డుకుందని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కిరాతకుడు. ఈ దారుణ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన దీపిక(28), తన భర్త అవినాశ్(30)తో కలిసి పాలక్కాడ్ జిల్లాలోని కరాకురుస్సి ప్రాంతంలో నివాసం ఉంటోంది. అవినాశ్ ఎయిర్ ఫోర్స్ సివిల్ కాంట్రాక్ట్ కంపెనీలో సహాయ సూపర్ వైజర్గా పని చేస్తున్నాడు. వీరికి ఏడాదిన్నర వయసున్న కొడుకు ఉన్నాడు. అయితే ఉదయే నిద్రలేవగానే బ్రష్ చేయకుండా కొడుకుని ముద్దు పెట్టుకునేందుకు అవినాశ్ ప్రయత్నించగా.. భార్య దీపిక అడ్డుకుంది. పళ్లు తోముకోకపోవడంతో భార్య దీపిక దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. కోపంతో ఊగిపోయిన అవినాశ్.. దీపికపై కత్తితో దాడి చేశాడు. దీంతో దీపిక తల, మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి. అరుపులు విన్న పొరుగింటివారు దీపికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు అవినాశ్ రెండు నెలల క్రితమే కుటుంబ సభ్యులతో కలిసి కరాకురిస్సికి వచ్చాడు. అవినాశ్ కు దీపిక రెండో భార్య. ఒడిశాకు చెందిన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అతడు.. 2019లో దీపికను పెళ్లి చేసుకున్నాడు.
తాజావార్తలు
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..