మన నేతలు, ప్రజాప్రతినిధులు భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.. సీఎంలు, మంత్రులు, నేతలు అనే తేడా లేకుండా.. దాని కోసం రాజ్యాంగాన్ని మార్చాలి.. దీనికోసం రాజ్యాంగాన్ని మార్చాల్సిందే నంటూ సందర్భాన్నిబట్టి కామెంట్లు చేస్తూనే ఉన్నారు.. తాజాగా, ఈ జాబితాలో కేరళ మంత్రి సాజి చెరియన్ చేరారు.. మల్లపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కార్మికులు నిరసన వ్యక్తం చేసేందుకు దేశం అనమతించదని.. కానీ, వారిపై దోపిడీ చేసే వారిని ప్రోత్సహిస్తోందని మంత్రి విమర్శించారు. దీని కారణంగానే కార్పొరేట్ రంగం విస్తరిస్తూ.. మిలీనియర్ల సంఖ్య పెరిగిపోతోందని ఆరోపించారు. అంతేకాదు.. మరో ముందడుగు వేసిన ఆయన.. బ్రిటీష్ వారు రాజ్యాంగాన్ని ఓ భారతీయుడు రాశారని దానినే 75 ఏళ్లుగా అమలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.. లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటివి వాటిలో పొందుపరిచారని.. ఎవరు దీనికి విరుద్ధంగా మాట్లాడినా తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు మంత్రి చెరియన్.
Read Also: Asaduddin Owaisi: పెట్రోల్ రేటు పెరగడానికి తాజ్‌మహలే కారణం
అయితే, మంత్రి చెరియన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో.. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌తో పాటు సీఎం పినరయి విజయన్ వివరణ కోరారు.. దేశ రాజ్యాంగం ప్రజలను, సామాన్యులను దోచుకోవడానికి దోహదపడిందనే తరహాలో మంత్రి వ్యాఖ్యలు ఉండడంతో.. రాజ్యాంగాన్ని మంత్రి చెరియన్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. మంత్రి సాజీ చెరియన్‌ను ముఖ్యమంత్రి వెంటనే బహిష్కరించాలని.. లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామిని హెచ్చరించారు.. అయితే, రాజ్యాంగంపై మంత్రి సాజీ చెరియన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ వివరణ కోరారు. ఈ వ్యవహారంపై రాజ్‌భవన్ జోక్యం చేసుకోవడంతో వివరణ ఇవ్వాలని మంత్రిని కోరారు సీఎం. కాగా, రాజ్యాంగాన్ని విమర్శించడం తన ఉద్దేశ్యం కాదని, ప్రభుత్వాన్ని విమర్శించడమేనని మంత్రి స్పందించినట్లు సమాచారం. మంత్రి సాజి చెరియన్ ప్రసంగం వివాదాస్పదంగా మారడంతో దీనిపై వివరణ ఇచ్చేందుకు త్వరలో మీడియా ముందుకు వస్తారని తెలుస్తోంది.