Wife can terminate pregnancy without husband’s approval says kerala high court: కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహిత మహిళలు గర్భం దాల్చడం ఆమె ఇష్టం అని హైకోర్టు పేర్కొంది. దీనికి భర్త అనుమతి అవసరం లేదని చెప్పింది. ప్రసవ సమయంలో ఒత్తడిని, ఆ బాధను అనుభవించేది స్త్రీనే అని కీలక వ్యాఖ్యలు చేసింది. గత గర్భాన్ని తొలగించాలని 21 ఏళ్ల మహిళ కేరళ హైకోర్టును అభ్యర్థించింది. దీనిపై కేరళ హైకోర్టులో సోమవారం…
Kerala A Hot Spot of Terrorism says jp nadda: కేరళలో తీవ్రవాదం ఎక్కువ అయిందని.. ఉగ్రవాదానికి హాట్ స్పాట్ గా మారిందని.. ఇక్కడ జీవితం సురక్షితంగా లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేరళలో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబం కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఆరోపించారు. వామపక్షాలు కుటుంబ, రాజరిక పాలనలో పడిపోయాయని ఆరోపించారు. పినరయి విజయన్ కూతురు, అల్లుడు ప్రభుత్వ…
kerala Hijab Protest: ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా హిజాబ్ వివాదం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. విద్యాసంస్థల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని కర్ణాటక హైకోర్టు వ్యతిరేకించింది. ఇది ఇస్లాంతో తప్పని సరి సంప్రదాయం కాదని తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉంది. ఇదిలా ఉంటే కేరళలో కూడా హిజాబ్ వివాదం చెలరేగింది. కేరళలోని కోజికోడ్ లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని హిజాబ్ ధరించినందుకు పాఠశాలలోకి ప్రవేశాన్ని నిరాకరించడంతో వివాదం చెలరేగింది.
Kerala Lottery winner is in Trouble: కేరళలో ప్రభుత్వం మెగా ఓనం లాటరీలో రూ. 25 కోట్లు గెలిచారు ఓ ఆటో డ్రైవర్. ఈ విషయం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఓ సాధారణ ఆటో డ్రైవర్ లాటరీలో ఇన్ని కోట్లు గెలవడం ప్రజల్ని ఆకర్షించింది. అయితే ఇప్పుడు లాటరీ విన్నర్ అనూప్ బాధపడుతున్నారు. నేను ఎందుకు లాటరీని గెలిచానని.. గెలవకుంటే బాగుండేదని భావిస్తున్నారు. నేను మనశ్శాంతిని కోల్పోయాను..ప్రస్తుతం నేను నా సొంత ఇంటిలో కూడా నివసించలేకపోతున్నానని…
PFI called for Kerala bandh: గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై దాడులు చేసింది. ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాటు మనీలాండరింగ్ కు పాల్పడుతున్నారనే అభియోగాలపై ఎన్ఐఏ, ఈడీ అధికారులు దాడులు చేశారు. దాదాపుగా 100 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రాలకు సమాచారం లేకుండా పకడ్భందీగా కేంద్ర సంస్థలు ఆపరేషన్ చేశాయి.
Lottery Tickets: కేరళలో లాటరీలు కొంతమందికి కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్నాయి. ఇటీవల కేరళలో ఓ ఆటోడ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. అతడికి రూ.25 కోట్ల లాటరీ తగిలింది. అయితే అందరినీ అలాంటి అదృష్టం వరించదు. నాణేనికి బొమ్మ ఉన్నట్లే బొరుసు కూడా ఉంటుంది. నాణేనికి మరోవైపు పరిశీలిస్తే లాటరీ టిక్కెట్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి కష్టాలు పడే వాళ్లు కూడా ఉన్నారు. కేరళలోనే మరో వ్యక్తి 52 ఏళ్లుగా లాటరీ టిక్కెట్లు…
Petition in Kerala High Court on India Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ గత వైభవం కోసం, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ ‘ భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర 14వ రోజుకు చేరింది. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర…
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. తన యాత్రలో రాహుల్ గాంధీ చలాకీగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఏ మాత్రం అలసట లేకుండా ఆయన ముందుకు సాగిపోతున్నారు. ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన కేరళలో పర్యటిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ తన పాదయాత్ర మధ్యలో దొరికిన విరామాన్ని ఉల్లాసంగా గడుపుతున్నారు. సోమవారం నాడు కేరళలో పర్యటిస్తున్న సందర్భంగా పున్నమాడ సరస్సులో జరిగిన స్నేక్ బోట్…
Auto Driver: కేరళలోని ఓ ఆటోడ్రైవర్ నక్క తోకను తొక్కాడు. అదృష్ట దేవత అతడిని లాటరీ రూపంలో కరుణించింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కేరళలో ఓనం పండగ సందర్భంగా తిరువోణం బంపర్ లాటరీని నిర్వహించారు. ఈ లాటరీలో తిరువనంతపురంలోని 32 ఏళ్ల ఆటోరిక్షా డ్రైవర్ అనూప్ రూ.25 కోట్ల మెగా బహుమతిని సొంతం చేసుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ బహుమతుల విజేతలను నిర్వాహకులు ప్రకటించారు. ఈ సందర్భంగా టికెట్…
Kerala stray dog menace: కేరళలో ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. కుక్కలను చూస్తేనే జనాలు వణికిపోతున్నారు. నడిరోడ్డపై వెళ్తున్న ప్రజలపై దారుణంగా దాడులు చేస్తున్నాయి. కేరళలోని వీధి కుక్కల బెడద దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పలు సందర్భాల్లో వీధి కుక్కలు చేసిన దాడులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేరళలో ఏ ఏడాది కుక్క కాటు వల్ల రేబిస్ సోకి ఇప్పటి వరకు 21 మంది మరణించారు. దీన్ని బట్టి చూస్తే అక్కడ…