Wife can terminate pregnancy without husband’s approval says kerala high court: కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహిత మహిళలు గర్భం దాల్చడం ఆమె ఇష్టం అని హైకోర్టు పేర్కొంది. దీనికి భర్త అనుమతి అవసరం లేదని చెప్పింది. ప్రసవ సమయంలో ఒత్తడిని, ఆ బాధను అనుభవించేది స్త్రీనే అని కీలక వ్యాఖ్యలు చేసింది. గత గర్భాన్ని తొలగించాలని 21 ఏళ్ల మహిళ కేరళ హైకోర్టును అభ్యర్థించింది. దీనిపై కేరళ హైకోర్టులో సోమవారం వాదనలు నడిచాయి. వివాహిత స్త్రీ తన గర్భాన్ని తొలగించుకోవడానికి ఆమె భర్త అనుమతి అవసరం లేదని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ లో గర్భాన్ని తొలగించుకోవడానికి స్త్రీ తన భర్త అనుమతిని పొందాలనే నిబంధన ఎక్కడా లేదని కోర్టు పేర్కొంది. గర్భం, ప్రసవ సమయంలో ఒత్తడి, బాధను భరించేది స్త్రీ అని వ్యాఖ్యానించింది. కేరళ కొట్టాయంకు చెందిన 21 ఏళ్ల యువతి తన గర్భాన్ని తీసేయాలని అనుమతి కోరుతూ.. దాఖలు చేసిన పిటిషన్ పై కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో యువతి భర్త నుంచి విడాకులు పొందలేదు..విడో కాదని వ్యాఖ్యలు చేసింది.
Read Also: Zahirabad Girl Case: జహీరాబాద్ అత్యాచారం కేసులో ట్విస్ట్.. బురిడీ కొట్టించిన యువతి?
కోట్టాయంలో 21 ఏళ్ల యువతి ఓ వ్యక్తితో పారిపోయి కొన్ని నెలల తర్వాత అతడిని వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన తర్వాత యువతిని భర్త, అత్త వేధించడం ప్రారంభించారు. ఇదిలా ఉంటే గర్భం దాల్చిన తర్వాత ఆమెను అనుమానించడం ప్రారంభించాడు ఆమె భర్త. ఇలాంటి వేధింపుల మధ్య ఆర్థికంగా, మానసికంగా సదరు యువతికి భర్త అండగా నిలవలేదు. భర్త, అత్త ప్రవర్తన రోజురోజుకు క్రూరంగా మారింది. దీంతో సదరు యువతి తన తల్లిదండ్రుల వద్దకు రావడం తప్పా మరో అవకాశం లేకుండా పోయింది.
ఈ క్రమంలో ఆమె తన గర్భాన్ని తొలగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఓ ఆస్పత్రిని సంప్రదించగా.. భర్త నుంచి విడిపోయినట్లు చట్టబద్ధం అయిన రుజువులు లేకపోవడంతో ఆస్పత్రి గర్భాన్ని తొలగించేందుకు నిరాకరించింది. దీంతో ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ వీజీ అరుణ్ తీర్పు సమయంలో బాధితురాలు తన భర్తపై క్రిమినల్ కేసు నమోదు చేసింది.. అతనితో ఉండేందుకు మొగ్గు చూపలేదని.. ఆమె వివాహం తీవ్రమై ఒడిదొడుకులకు కారణం అయిందని కోర్టు గుర్తించిందని అన్నారు. కొట్టాయం మెడికల్ కాలేజ్ లేదా.. మరో ఇతర ప్రభుత్వ ఆస్పత్రిలో అయిన ఆమె గర్భాన్ని తీసేయడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.