kerala Hijab Protest: ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా హిజాబ్ వివాదం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. విద్యాసంస్థల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని కర్ణాటక హైకోర్టు వ్యతిరేకించింది. ఇది ఇస్లాంతో తప్పని సరి సంప్రదాయం కాదని తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉంది. ఇదిలా ఉంటే కేరళలో కూడా హిజాబ్ వివాదం చెలరేగింది. కేరళలోని కోజికోడ్ లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని హిజాబ్ ధరించినందుకు పాఠశాలలోకి ప్రవేశాన్ని నిరాకరించడంతో వివాదం చెలరేగింది.
కోజికోడ్ లోని ప్రావిడెన్స్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని హిజాబ్ ధరించినందుకు తరగతులకు హాజరు నిరాకరించారని చెబుతూ ముస్లిం సంస్థలు, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. హిజాబ్ ధరించి రావద్దని చెప్పారని బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేసిందని పాఠశాల అధికారులు తెలియజేశారు. కుటుంబ సభ్యులు జోక్యం చేసుకున్న యాజమాన్యం తీరు మార్చుకోకపోవడంతో విద్యార్థిని తన చదువును నిలిపివేసింది. రాజ్యంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న విద్యాలయ అనుమతులను విద్యాశాఖ తొలగించాలని ముస్లిం విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఈ విషయంలో భారీగా నిరసనలు తెలుపుతున్నారు. పాఠశాల ముందు కూర్చున్న జనాలను పోలీసులు చెదరగొట్టారు.
Read Also: Rajastan Political Crisis: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో నామినేషన్ దాఖలుకు గెహ్లాట్ దూరం
ఓ వైపు ఇరాన్ దేశంలో మహిళలు హిజాబ్ వద్దంటూ నిరసనలు తెలుపుతున్న క్రమంలో కేరళలొో హిజాబ్ అంశం వెలుగులోకి వచ్చింది. ఇరాన్ లో మహ్సా అమిని అనే 22 ఏళ్ల అమ్మాయిని హిజాబ్ ధరించలేదని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత మహ్సా అమిని చనిపోయింది. దీంతో ఇరాన్ లోని యువత, మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. మహిళలు హిజాబ్ తీసేసి, జుట్టు కత్తిరించుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఇప్పటి వరకు ఇరాన్ ఘర్షణల్లో 50 మందికి పైగా ఆందోళనకారులు మరణించినట్లు తెలుస్తోంది.