Kerala A Hot Spot of Terrorism says jp nadda: కేరళలో తీవ్రవాదం ఎక్కువ అయిందని.. ఉగ్రవాదానికి హాట్ స్పాట్ గా మారిందని.. ఇక్కడ జీవితం సురక్షితంగా లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేరళలో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబం కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఆరోపించారు. వామపక్షాలు కుటుంబ, రాజరిక పాలనలో పడిపోయాయని ఆరోపించారు. పినరయి విజయన్ కూతురు, అల్లుడు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.
కేరళ కొట్టాయంలో బీజేపీ పార్టీ కార్యక్రమానికి హాజరైన జేపీ నడ్డా ప్రాంతీయ పార్టీలపై విరుచుకుపడ్దారు. చాలా వరకు ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలే అని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి దేవీలాల్ జయంతిని పురస్కరించుకుని హర్యానాలో విపక్ష పార్టీ ర్యాలీని పస్తావించి విమర్శలు చేశారు. అవన్నీ కుటుంబ పార్టీలే అని.. అవినీతి ఆరోపణల్లో ఉన్న పార్టీలే అని జేపీ నడ్డా విమర్శించారు. వంశపారంపర్య పార్టీలు, అవినీవి పార్టీల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీ పోరాడుతోందని ఆయన అన్నారు. కేరళలో మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని.. హింసను ప్రేరేపించే వారికి వామపక్ష ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు.
Read Also: Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్‌పై నిషేధం.. ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆర్డినెన్స్
బూల్ స్తాయి వరకు బీజేపీ పార్టీని తీసుకెళ్లాలని.. బీజేపీ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి కేరళలో ఎలాంటి పాలన సాగిస్తున్నారో తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. తిరువనంతపురంలో బీజేపీ జిల్లా కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కేరళ విశ్వవిద్యాలయాల్లో బంధుప్రీతి ఆధారంగా నియామకాలు జరుగుతన్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న వారి బంధువులే యూనివర్సిటీల్లో నియమితులవుతున్నారని అన్నారు. కేరళ ప్రభుత్వం లోకాయుక్త అధికారాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.