Bharat Jodo Yatra: 600 కిలోమీటర్ల పూర్తి చేసుకున్న రాహుల్ జోడో యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టారు. సెప్టెంబర్7వ తేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర తమిళనాడు, కేరళలో పూర్తిచేసుకుని ఇటీవల కర్ణాటకలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. కాగా భారత్ జోడో యాత్ర 26వ రోజు కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ప్రవేశించింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పూర్తైన యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించగా రాహుల్ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తుంది. అయితే ఇదే సమయంలో అవకాశం దొరికినప్పుడల్లా రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. తన భారత్ జోడో యాత్రకు రైతు ఉద్యమమే ప్రేరణ అన్నారు. అన్నదాతలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం సాగుతుందని, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందన్నారు. లఖింపుర్ ఘటన జరిగి ఏడాది అయినా.. అమరవీరులైన రైతులకు న్యాయం దక్కలేదన్నారు. ఎప్పటిలాగే బీజేపీ ప్రభుత్వం నేరస్థులను కాపాడుతోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఈ విషయాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. ఇప్పటికి అజయ్ మిశ్రా కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతుండడాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. మరోవైపు ప్రియాంకగాంధీ కూడా లంఖీపూర్ ఖేరీ ఘటనలో కేంద్రప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ ట్వీట్ చేశారు.
Read Also: Terror plans Busted: భారీ పేలుళ్ళకు కుట్ర.. కదులుతున్న ఉగ్రమూలాల డొంక
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
భారత్ జోడో యాత్ర కర్ణాటకలో ఉత్సాహంగా కదులుతోంది. మైసూర్‌లో పాదయాత్ర సందర్భంగా మందిర్, మసీదు, చర్చిని రాహుల్ సందర్శించారు. దసరా ఉత్సవాల సందర్భంగా చాముండేశ్వరి దేవిని రాహుల్‌గాంధీ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో రాహుల్‌గాంధీ కర్నాటక ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రతి పనుల్లో 40 శాతం కమీషన్‌తో ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. అవినీతిలో కర్నాటక టాప్‌లో ఉంది. ప్రతి పనిలో ఇక్కడ 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. రైతులు , చిరువ్యాపారులు , కార్మికుల నుంచి లంచాలు తీసుకుంటున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్ర 26వ రోజు కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ప్రవేశించింది. కాగా.. అక్టోబర్ 4, 5 తేదీలో దసరా సందర్భంగా రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకుంటారు. 6వ తేదీ ఉదయం భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది.
- Tags
- bjp
- congress
- jodo yatra
- karnataka
- Kerala
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!