గత ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయింది.. కార్ఖానా నుంచి ఇక కారు వాపసు రాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కారు ఇక తుకానికి పోవాల్సిందేనని ఆయన అన్నారు. గద్దరన్నను అవమానించిన ఉసురు తగిలి కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిందని, పేదల చెమట గిట్టని కేసీఆర్… బస్సు యాత్ర మొదలు పెట్టిండన్నారు రేవంత్ రెడ్డి. బస్సు యాత్ర కాదు.. ఆయన మోకాళ్ల యాత్ర చేపట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరని, సినిమా…
కాళేశ్వరం విషయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్ లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏడాదికి కరెంట్ బిల్లే రూ.10 వేల కోట్లు అవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు కూడా చేయలేదని విమర్శించారు.
కేసీఆర్ కి నాలెడ్జ్ ఉంది అనుకున్న.. ఏం మాట్లాడిండో.. ఎందుకు మాట్లాడిండో అర్థం కాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎంత పని లెనోడు అయినా నాలుగు గంటలు లైవ్ లో మాట్లాడతాడా అని విమర్శించాడు. మెంటల్ గానికి ఎవరు ఏందో తెలియదని తనకు కాంట్రాక్టు పనులే లేవన్నారు.
ఈ ప్రభుత్వ హయాంలో రైతు బంధు, రైతు బీమా ఉంటుందో.. ఉండదో తెలియని పరిస్థితి ఏర్పడిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. బస్సు యాత్రలో భాగంగా సూర్యాపేటకు చేరుకున్న ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
రాష్ట్రంలో నీళ్ల పంచాయితీ మళ్లీ మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టుల విషయంపై అధికార పార్టీ, బీఆర్ఎస్ నాయకులు రాళ్లు రువ్వుకున్నారు. తప్పు మీదంటే.. మీదంటూ ఒకరినోకరు విమర్శించుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. కొంతకాలం క్రితం వరకు ధీమాగా ఉన్న రైతాంగం ప్రస్తుతం దిగాలు పడుతోందని కేసీఆర్ అన్నారు.
మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారని..అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నిన్న నాలుగు గంటలు టీవీ స్టుడియోలో ఎలా కూర్చున్నాడని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మందేసి గీశాడో.. దిగాక గేసాడోగానీ కూలిపోయిందని విమర్శించారు.
అసెంబ్లీ చర్చలకి రాని దద్దమ్మలు 4గంటలు మీడియాలో కూర్చున్నారని కేసీఆర్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చకు సిద్ధమా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ అద్భుతం అంటున్నాడని.. కాళేశ్వరం దగ్గరనే చర్చ పెడుదం రా.. అని సవాల్ విసిరారు.
మాజీ ముఖ్యమంత్రి తాను ఒక్కడే తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటారని.. అది పచ్చి అబద్ధమన్న విషయం ప్రజలందరికీ తెలుసని కోదండ రామ్ అన్నారు. కాజిపేట్, మడికొండలో జరిగిన జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. కడియం కావ్యకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.