BJP MP Laxman: మోడీనీ ప్రధాని చేయడానికి కిషన్ రెడ్డినీ గెలిపించాలి అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. గతంలో ఎవరికి ఓటు వేసినా.. ఇప్పుడు మాత్రం మోడీకే ఓటు వేస్తామని ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు.. దళిత వాడల్లో ప్రజలంతా మోడీనే కోరుకుంటున్నారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేసి గెలుస్తున్నారు.. తప్ప ప్రజలకు ఒరుగా పెట్టింది ఏమి లేదన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారం చేపట్టి ఐదు నెలలు గడుస్తున్నా.. ఆ హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు.. ఇప్పటికే రాష్ర్టంలో కరెంటు కోతలు, నీటి ఎద్దడి ప్రారంభమయ్యాయని ప్రజలు వాపోతున్నారంటూ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.
Read Also: Thota Narasimham: మరొకసారి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి..
ఇక, కాంగ్రెస్ పార్టీ మోడీ చేసిన అభివృద్ధి అంశాలు చర్చించకుండా.. రాజ్యాంగం రద్ధని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని భూటకపు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు.మాట్లాడితే గాడిద గుడ్డు అని అలా అంటున్నారు.. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎలాంటి సేవలు అందించారని ప్రజలకు పూర్తి అవగాహన ఉంది.. మీరు చెప్పే మాయ మాటలకు మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు.. మైనారిటీలకు బీజేపీనీ బూచ్చిగా చూపించి రాజకీయంగా చీలికలు తీసుకొచ్చి ఓట్లు దందుకుందామంటే అందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రామ మందిరం గురించి మాట్లాడితే ఎందుకు విషం చిమ్ముతున్నారో అర్థం కావడం లేదు.. హిందువుల పట్ల ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. జై శ్రీరామ్ అంటే ఏమైనా పాపమా..
జై శ్రీరామ్ కి బదులు జై కేసీఆర్, జై రేవంత్ రెడ్డి అనాలా..? అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు.
Read Also: Premalu 2 :అప్పుడే షూటింగ్ మొదలు పెట్టేసారుగా..
అలాగే, హిందూ పడుగల మీద, హిందువుల మీద రకరకాలుగా అవహేళన చేస్తున్న మీకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. సికింద్రబాద్ లో బీజేపీ గెలుపు ఖాయం.. నరేంద్ర మోడీ కూడా హ్యాట్రిక్ ప్రధాని అవ్వడం కూడా అంతే ఖాయం.. కాంగ్రెస్ వాళ్లు పగటి కలలు కంటున్నారు.. రాహుల్ గాంధీ వాయినార్ నుంచి పారిపోయి దొడ్డి దారిన రాయిభేరి కి వచ్చాడన్నారు. రాయ్ బరేలిలో కూడా రాహుల్ గాంధీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. దిక్కుతోచనీ పరిస్థితిలో రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల అంశం తెరపైకి తెచ్చారు..రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చరిత్ర రేవంత్ రెడ్డి తెలుసుకుంటే మంచింది.. రిజర్వేషన్లు కులాల మీద ఉన్నట్లైతే.. దేశంలో ప్రతిభ దెబ్బ తింటుందని నెహ్రూ మాట్లాడాడు.. ప్రతిభ లేని వారు ఉద్యోగాలకు వస్తే
దేశం వెనుకబడిపోతుందని చెప్పి ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ది అని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.