Harish Rao: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ..”బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు. దేశవ్యాప్తంగా 157 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇస్తే రాష్ట్రానికి ఒక్కట ఇవ్వలేదు. కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు, నవోదయ స్కూళ్లు ఇవ్వలేదు. కేసీఆర్ తెలంగాణను దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చితే వడ్లు కొనకుండా వివక్ష చూపారు. తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది.? కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, రైతులకు ఉచిత కరెంటు, మెడికల్ కాలేజీలు, కొత్త జిల్లాలు, కేసీఆర్ కింట్, మంచినీళ్లు, తాగు నీళ్లు ఇచ్చిండు. బీజేపీ ఏం చేసింది. నల్లచట్టాలు తెచ్చి లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించి 700 మంది రైతులను పొట్టనబెట్టుకుంది. ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పారుగాని బిల్లు పెట్టలేదు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టింది.”
READ MORE: Canada: ఖలిస్తాన్ ఆందోళనలపై రాజకీయాలను ప్రభావితం చేయాలని భారత్ ప్రయత్నిస్తోంది..
Also Read
ఆధ్యాత్మికంలో బీజేపీకంటే కేసీఆర్ రెండు అడుగులు ముందు ఉన్నారని హరీశ్ రావు అన్నారు. “కేసీఆర్ బస్సుయాత్రకు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్‌కే ఎక్కువ వస్తాయి. నిశ్శబ్ద విప్లవం రాష్ట్రంలో వస్తుంది. రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో నీళ్లు , కరెంటు పుష్కలంగా ఉండంతో ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. రేవంత్ బీజేపీలో చేరతారని అర్వింద్, మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. దీన్ని రేవత్ ఎందుకు ఖండించడం లేదు. కవిత అరెస్ట్ కాలేదు కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒకటని అబద్ధాలు చెప్పి మైనారిటీ ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు కవిత అరెస్టయ్యారు, కుక్మక్కయితే ఎందుకు అరెస్ట్ అవుతారు. రేవంత్ మైనారిటీలను మోసం చేస్తున్నారు. కేబినెట్లో మైనారిటీని తీసుకోలేదు. రంజాన్ తోఫా నిలిపేశారు. రేవంత్ మోదీని బడే బాయ్ అంటూ ఆశీర్వాదాలు కోరుతున్నారు.”
బీజేపీ, కాంగ్రెస్ లు రాజకీయ ప్రయోజనాల కోసం ఏడు మండలాలను ఏపీకి ఇచ్చాయని హరీశ్ రావు ఆరోపించారు.”ఆరు గ్యారంటీలను అమలు చేశాకే కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. కాంగ్రెస్ బాండు పేపర్ బౌన్స్ అయింది. అందుకు శిక్ష వేయాలని ప్రజలను నిర్ణయించారు. అప్పుడు ప్రామిస్‌లు ఇప్పుడు దేవుళ్లపై ప్రామిస్‌లు. హామీలు అమలు కావడడం లేదంటే చెప్పుతో కొట్టాలని దూషిస్తున్నారు. ఢిల్లీకి మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ హామీల అమలుపై పరిపాలనపై లేదు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను, ఆయన సీనియారిటీని గౌరవించకుండా రేవంత్ కళ్లు పీకుతా, పేగులు మెడలో వేసుకుంటా అని దుర్భాషలాడుతున్నారు. కేసీఆర్ పరిపాలన వికేంద్రీకణ కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తానంటున్నాడు. ఇది ముందుకు పోవడమా, వెనక్కి పోవడమా?. రాష్ట్రంలో పరిపాలన లేదు, పగ ప్రతీకారాలు కనిపిస్తున్నాయి. ప్రజాపాలనలో 3 లక్షల యాభైవేల దరఖాస్తులు వచ్చాయి. ఎన్ని పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే పనిగా పెట్టుకున్నాడు రేవంత్. మా సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ వాటినే ప్రోత్సహిస్తోంది. 8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్, 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా బీజేపీ ఒప్పందం చేశాయి. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులు అంటున్నారు. రేవంత్ రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయి. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.”
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!