సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. మూడు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ కొనసాగింది.
KCR: నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు గులాబీ బాస్. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉండటంతో కేసీఆర్ ఇవాళ శాసనసభా సభ్యులు మీటింగ్ ఏర్పాటు చేశారు.
గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచి పెట్టాలని చూస్తుంది అని ఆరోపించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (ఎస్ఆర్ఎస్పీ)లో నీరు తగ్గిన కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశాం అన్నారు. ఇక, మేడిగడ్డలోని ఒక్క బ్లాక్ లో ఒక పిల్లర్ మాత్రమే కుంగితే మాపై బురద జల్లి అధికారంలోకి వచ్చారు అని హరీష్ రావు విమర్శించారు.
Niranjan Reddy: కాంగ్రెస్ రైతుల కోసం ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ అమలు కావడం లేదు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతుబంధు, రైతు బీమా దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రూ. 6,122 కోట్లు రైతులకు ప్రీమియం కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది.. కానీ, కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటు, రైతుబంధు, రైతు బీమా రావడం లేదు అని ఆరోపించారు.
Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ఈఎన్సీలు నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్ రావు, నరేందర్ రెడ్డిల విచారణ ముగిసింది. ముగ్గురు ఈఎన్సీలను ఒకేసారి కూర్చోపెట్టి కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. చేసిన ప్రతిజ్ఞకు న్యాయం చేయాలని… నిజాలను చెరిపి వేయొద్దని కమిషన్ వ్యాఖ్యానించింది. ఇంజనీర్లు పలు డాక్యుమెంట్లను దాచారని కమిషన్ కామెంట్ చేసింది. డిజైన్స్, డీపీఆర్, నిర్మాణ సంస్థకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందంపై కమిషన్ ప్రశ్నలు సంధించింది. అన్నారం, సుందిళ్ల, లొకేషన్ మార్పు…
MLC Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన నేపథ్యంలో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేసీఆర్ ఫోబియాలో ఉన్నారని, ఆయనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని చెప్పడం, వాస్తవాలను వక్రీకరించడం తప్ప మరేదీ కాదన్నారు. 2024-25 కాగ్ రిపోర్ట్ ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రూ. 22,000 కోట్ల వడ్డీలు కట్టిందని,…
Bandi Sanjay : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగమంతా పచ్చి అబద్దాలు, అర్ధ సత్యాలతో నిండిపోయిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటమి ఖాయమనే భయం ఆయనలో స్పష్టంగా కన్పిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్ సహా అన్ని సర్వే సంస్థలన్నీ బీజేపీ గెలుపు తథ్యమని తేల్చేశాయని, కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోతుందని నివేదికలివ్వడంతో దిక్కుతోచని ముఖ్యమంత్రి హడావుడిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి…
బీఆర్ఎస్, బీజేపీ రహస్య ఎజెండా ఏంటి..? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. పట్టభద్రులు గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచించాలని కోరుతూ, బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత పట్టభద్రుల లే కదా. వీరు ఎవ్వరికి ఓటు…
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. పట్టభద్రులు గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచించాలని కోరుతూ, బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత పట్టభద్రుల లే కదా. వీరు ఎవ్వరికి ఓటు వేస్తారు?…
‘కేసీఆర్’ ఇంటర్నెట్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత! మాజీ సీఎం కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్ జిరాక్స్ సెంటర్ను ఎమ్మెల్సీ కవిత సోమవారం ప్రారంభించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుడైన సతీశ్కు ఆర్థికంగా చేయూతనందించిన కవిత.. నేడు ‘కేసీఆర్’ ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్ను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మాజీ ఎంపీ మలోత్ కవిత పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా…