Minister Komatireddy: అసెంబ్లీలో రోడ్లు భవనాల శాఖ పద్దులను ప్రవేశ పెట్టిన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. 2025-26 సంవత్సరానికి గాను రోడ్లు, భవనాల శాఖకు రూ.5903.95 కోట్ల ప్రతిపాదించాం. రాష్ట్ర బడ్జెట్ ద్వారా 1,790 కి.మీ + 98.26 కి.మీ రోడ్లు మెరుగుపరచడానికి, 52 వంతెనల నిర్మాణానికి రూ. 6,547.48 కోట్ల విలువగల పనులకు అనుమతి మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం 747.8 కి.మీ పొడవున రూ. 2,120.81 కోట్ల విలువగల 89 పనులు ప్రగతిలో ఉన్నాయి.. MoRTH నుంచి CRIF క్రింద 435.29 కి.మీ రోడ్ల అభివృద్ధికి రూ. 850 కోట్ల అనుమతులు వచ్చాయి.. CRIF కింద 394.29 కి.మీ పొడవున రూ. 785 కోట్ల విలువగల 29 పనులు ప్రగతిలో ఉన్నాయి..మీరు ఆర్డీసీ ద్వారా చేసిన రూ. 4,167.05 కోట్ల లోన్ తీసుకోవడం జరిగింది.. హాస్పిటల్స్ నిర్మాణం చేయడం మంచి విషయం.. ఎల్బీనగర్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణాన్ని 24 ఫ్లోర్లుగా నిర్మిస్తే.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు అనుగుణంగా సరిదిద్దాం.. అల్వాల్ టిమ్స్ ను ఆగష్టు, 2025 నాడు ప్రారంభించేలా ప్రయత్నిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.
Read Also: Konda Surekha : అటవీ శాఖపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
ఇక, అల్వాల్ టిమ్స్ కు సంబంధించి భూములకు సంబంధించి సమస్య ఉంటే డిఫెన్స్ వాళ్లతో మాట్లాడి ఎన్వోసీ ఇప్పించాను అని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. 2, జూన్ నాటికి సనత్ నగర్ టిమ్స్ ను పూర్తి చేసి ప్రారంభించాలని యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నాం.. ఇప్పటికే ఉస్మానియా హాస్పిటల్ కు గౌరవ ముఖ్యమంత్రిగారితో భూమిపూజ చేయించాం, త్వరలో టెండర్లు పిలవబోతున్నాం.. అందరం తెలంగాణ బావుండాలని కోరుకుందాం.. తెల్లారి లేచిన దగ్గరి నుంచి రాజకీయాలు చేయడం మంచిది కాదు.. ప్రజలు మనల్ని గెలిపించి చట్ట సభలకు పంపించింది.. వారి జీవితాలను బాగు చేస్తారనే.. పదే పదే అడ్డుతగులుతున్న ప్రతిపక్ష పార్టీలకు మంత్రి చురకలు అంటించారు. మీరు పదేండ్లు అధికారంలో ఉన్నారు.. ఇప్పుడు మేం పదేండ్లు అధికారంలో ఉంటాం.. ప్రజల జీవితాలను బాగు చేస్తామన్నారు. మూడేండ్లు ప్రజల కోసం కలిసి పని చేద్దాం.. ఎన్నికల ముందు రాజకీయాలు మాట్లాడుకుందాం.. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. కేసీఆరే కాదు, ఎవరు వచ్చి సలహాలిచ్చిన స్వీకరిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు.