MLC Kavitha: కేసీఆర్ను నిందించడానికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు చెప్తున్నారు..
- కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..
- టక్క టమార విద్యలన్నీ ప్రదర్శించి.. బీఆర్ఎస్ కంటే ఒక్కశాతం ఎక్కువ ఓటింగ్ తో గెలిచారు..
- కేసీఆర్ను నిందించడానికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు చెప్తున్నారు: ఎమ్మెల్సీ కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: శాసన మండలిలో బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కేవలం కేసీఆర్ ని నిందించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు చెబుతున్నారు.. అబద్దాల విషయంలో ముఖ్యమంత్రికి గిన్నిస్ రికార్డు వస్తుందని పేర్కొన్నారు. సీఎం, మంత్రులు అబద్ధాలు చెప్పడం మానకపోతే సభలో ప్రివిలేజ్ నోటీసులు ఇస్తాం.. 420 హామీలు ఇచ్చి, గాంధీ కుటుంబాన్ని తీసుకొచ్చి సంతకాలు పెట్టిచ్చి.. గ్యారంటీలు ఇప్పిచ్చి.. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ నాయకులు ఓట్లు వేయించుకున్నారు.. ఇంత చేసినా బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేసింది. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించలేదన్నారు. రేవంత్ రెడ్డి సచివాలయానికి చుట్టపు లాగా వచ్చిపోతున్నారు.. ప్రజావాణీ వింటానని చెప్పి కేవలం ఒక్కసారి మాత్రమే ఆ కార్యక్రమానికి వచ్చారు.. ప్రజల్ని రోజూ కలుస్తానని చెప్పినా ముఖ్యమంత్రి అసలు ప్రజలను కలవడానికి ఇష్టపడడం లేదు.. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు అని ఎమ్మెల్సీ కవిత మండిపడింది.
Read Also: IPL 2025 SRH: ఈ అడ్డంకులను దాటుకొని సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించేనా?
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ఇక, కాంగ్రెస్ పార్టీ మార్కు కరప్షన్ కి, కన్నింగ్ నెస్ కి నిదర్శనం ఈ బడ్జెట్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అవినీతి కాంగ్రెస్ డిఎన్ఎ లో భాగం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగాన్ని కూడా ప్రాధాన్యతగా తీసుకోలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేదు.. కేవలం కేసీఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకుని పరిపాలన చేస్తుంది.. ఉద్యమ కాలంలో కేసీఆర్ ని లక్షల తిట్లు తిట్టినా అవి ఆశీర్వాదాలుగా మారాయి.. కేసీఆర్ హయాంలో అప్పులపై కాంగ్రెస్ పార్టీ పదే పదే దుష్ప్రచారం చేస్తుంది.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం అబద్ధమని బడ్జెట్ ద్వారా తేలిపోయింది.. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి చేసిన అప్పులు కేవలం రూ. 3 లక్షల కోట్లు మాత్రమే.. ఆయా కార్పొరేషన్లు తీసుకున్న రుణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీల మొత్తం కేవలం రూ. లక్షా 21 వేల కోట్లు మాత్రమే అని పేర్కొన్నారు. అంటే మొత్తం బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ. 4 లక్షల 22 వేల కోట్లు మాత్రమే.. ఈ లెక్కలను బడ్జెట్ పత్రాల్లో ప్రభుత్వమే తెలిపింది.. మరి కాంగ్రెస్ పార్టీ అప్పులపై పదేపదే ఎందుకు అబద్ధాలు చెబుతుంది? అని కవిత ప్రశ్నించింది.
Read Also: Robinhood: #Grok ముహూర్తం కలిసి రాలేదు.. రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్ వాయిదా!
అయితే, రాష్ట్రానికి చోధక శక్తిగా పని చేయాల్సిన ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రం దివాళా తీసిందని ప్రకటించడంతో ప్రజల గుండెలకు గుబేలుమనవా అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పెట్టుబడిదారులకు, ప్రజలకు విశ్వాసం కల్పించాల్సింది పోయి ఈ రకంగా సీఎం మాట్లాడటం దారుణం.. బీఆర్ఎస్ హయాంలో మూలధన వ్యయం కింద ఏటా దాదాపు 43 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో కేవలం మూలధన వ్యయంగా కేవలం రూ. 33 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.. అంటే దాదాపు నెలకు రూ. 2700 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తూ.. సీఎం ఏమో 500 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోతున్నామని అబద్ధాలు చెబుతున్నారు.. కీలకమైన ఇరిగేషన్ రంగానికి కేవలం 7.5 శాతం మాత్రమే కేటాయింపులు చేసి ప్రాజెక్టులను ముందుకు సాగకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, రైతాంగం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఇది నిదర్శనం.. ప్రాణాహిత చేవెళ్ల ప్రాజెక్టు 148 ఎఫ్ఆర్ఎల్ వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే కేవలం 44 టీఎంసీలు మాత్రమే నీటి లభ్యత ఉండేది.. 152 ఎఫ్ ఆర్ ఎల్ తో అయితే 160 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ ఆలోచించకుండా కాలువలు తవ్వడం మొదలు పెట్టారు అని కవత మండిపడింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!