తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు. పంచాంగ శ్రావణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ భవన్ లో పంచాంగ శ్రవణం జరిగింది. పంచాంగ శ్రవణం ప్రకారం.. ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు కనిపిస్తాయి. సంపూర్ణ వర్షాలు పడతాయి. ప్రభుత్వం పాలన చేయడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. కేంద్రం నుండి వచ్చే సహకారం కూడా తీసుకునే అవకాశం ఉండదు. పత్తి పంటలకు మంచి అవకాశం. ఎర్ర నేలలో వేసే పంటకు మంచి అవకాశం. వస్త్ర పరిశ్రమలు కొత్తగా వెలుస్తాయి అభివృద్ధి…
హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో జరిగిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా అజయ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదుల ప్రాజెక్టు, కాలేశ్వరం ప్రాజెక్టుల నిర్వహణపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ, దేవాదుల ప్రాజెక్టుపై అవగాహన లేకుండా కొంతమంది పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు తనదే రూపకల్పన అని, దీన్ని…
Boianapalli Vinod Kumar: హనుమకొండలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఎల్కతుర్తిలో జరగబోయే రజతోత్సవ సభ కొత్త తరానికి కొత్త ఆలోచనలు కలిగించే వేదికగా మారుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా…
ఎమ్మెల్సీలుగా రిటైర్ అవుతున్న వారు.. ప్రజలకు పార్టీకి ఎంతో సేవ చేశారు .. ఎమ్మెల్సీగా రిటైర్ అయిన వారికి విరామం మాత్రమే కానీ విశ్రాంతి కాదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చింది.
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మాటలయుద్ధం నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీరు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినా నీళ్లు ఇవ్వడానికి ఉందని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నుంచి నీరు తీసుకోకపోయినా పంటలు పండించాం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదారి పట్టించకండని, లగచర్లలో జరిగిందంటున్నారు.. మరి ఆనాడు మల్లన్నసాగర్లో జరిగింది ఏంటి అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కొండపోచమ్మ…
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి విచక్షణాధికారులు ఉపయోగిస్తే మీరు ఒక్కరైనా బయట ఉండేవారా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి జైల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తా అని ఎన్నికల హమీ ఇచ్చానన్నారు.. ఆ హామీ కూడా ఇంకా నెరవేర్చలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఏకమొత్తంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్నారని, ఎన్నిలయ్యాక…
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ గతంలో తనపై జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. కొన్ని వ్యక్తులు సలహాలు, సూచనలు ఇవ్వడానికే సిద్ధంగా ఉంటారని, కానీ వాటిని పాటించాల్సిన బాధ్యతను అనుసరించరని విమర్శించారు. తనపై రాజకీయ కక్ష సాధింపుతో వ్యవహరించారని, అందువల్లే చంచల్గూడ జైల్లో అత్యంత కఠినమైన నక్సలైట్ సెల్లో 16 రోజులు ఉంచారని తెలిపారు. జైల్లో ఉన్న సమయంలో కనీస సౌకర్యాలు…
Minister Thummala: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. మిగులు రాష్ట్రంగా ఉన్నప్పుడే లక్ష రూపాయల రుణమాఫీని కూడా ఒకే దఫాలో చెయ్యాలని ఆలోచన చెయ్యని వారు.. రెండో సారీ అధికారంలోకి వచ్చాక కూడా రుణ మాఫీకే రైతులను గోస పెట్టి ఎన్నికల వస్తున్నాయి.
మీరు పదేండ్లు అధికారంలో ఉన్నారు.. ఇప్పుడు మేం పదేండ్లు అధికారంలో ఉంటాం.. ప్రజల జీవితాలను బాగు చేస్తామన్నారు. మూడేండ్లు ప్రజల కోసం కలిసి పని చేద్దాం.. ఎన్నికల ముందు రాజకీయాలు మాట్లాడుకుందాం.. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. కేసీఆరే కాదు, ఎవరు వచ్చి సలహాలిచ్చిన స్వీకరిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Harish Rao : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గజ్వేల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు, రేవంత్ రెడ్డిని చిల్లర రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న నేతగా పేర్కొన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్కు గజ్వేల్ అంటే తల్లీ-పిల్లల బంధంలా ఉందని, ఆయన అభ్యాసంతోనే గజ్వేల్ అభివృద్ధిలో దూసుకెళ్లిందని తెలిపారు. ఒకప్పుడు గజ్వేల్ హింసాత్మక సంఘటనలు, కుట్రలు, పోలీస్ కేసులతో నిండిన…