తెలంగాణ సీఎం కేసీఆర్కు వివిధ సమస్యలపై లేఖలు రాస్తూ వస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. ముఖ్యంగా కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం గురించి.. కేంద్రం చేపట్టిన ప్రాజెక్టుల్లో రాష్ట్రం వాటా నిధుల వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నా ఆయన.. తాజాగా మరో లేఖ రాశారు.. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం రాష్ట్ర వాటా పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఇవాళ రాసిన లేఖలో సీఎం కేసీఆర్ను కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.…
కేంద్రం రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉంది, యాసంగి వడ్లను రాష్ట్రం కొనాల్సిందే అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కేంద్రం యాసంగికి సంబంధించి రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రం ఎందుకు వడ్లను కొనం అంటోందని బండి సంజయ్ ప్రశ్నించారు. కామారెడ్డి లోని పర్ణికా హోటల్ లో జరిగిన బీజేపీ జోనల్ సమావేశంలో పార్టీ జాతీయ సహా కార్యనిర్వాహక కార్యదర్శి శివప్రకాశ్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశా నిర్దేశం…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్న సాగర్కు చేరుకున్నారు. ఈరోజు మల్లన్నసాగర్ రిజర్వాయర్ను రాష్ట్రప్రజలకు అంకితం చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా మల్లన్నసాగర్కు చేరుకున్నారు. మల్లన్న సాగర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు మంత్రి హరీష్రావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ అతిపెద్ద రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ లో 50 టీఎంసీల నీటిని నిల్వచేసే సామర్థ్యం ఉంటుంది. ఈ రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట…
సిద్దిపేట జిల్లాలోని తుక్కాపూర్ మండలం పరిధిలోనున్న మల్లన్నసాగర్ జలాశయంను సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్దదైన మల్లన్నసాగర్ను రాష్ట్రప్రజలకు కేసీఆర్ అంకితం చేయనున్నారు. మల్లన్నసాగర్ పూర్తిసామర్థ్యం 50 టీఎంసీలు కాగా, ఇందులో 30 టీఎంసీల నీటిని జంటనగరాల తాగునీటికోసం తరలిస్తారు. పారిశ్రామిక అవసరాలకోసం 16 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. ఈ మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద కొత్తపాత ఆయకట్టు కలిపి మొత్తం 15,71,050 ఎకరాలు రానున్నాయి. 10 టీఎంసీలకు ఒక అంచె చొప్పున మొత్తం ఐదు…
కేసీఆర్ ఇంత కాలం బూతులే మాట్లాడుతారు అనుకున్నా.. ఇప్పుడు జోకులు కూడా బాగానే చెబుతున్నారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్పై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. హైదరాబాద్లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. రైతు బతికినంత వరకు రైతే అన్నారు.. రైతు అంటే నిర్వచనం ఏంటి? అని ప్రశ్నించిన ఆమె.. 66 లక్షల మంది రైతులు ఉంటే 41 లక్షల మంది రైతులకే రైతుభీమా ప్రీమియం ప్రభుత్వం కడుతుందని.. మిగతా 25…
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయంగా ఇప్పుడు తన ఆరాధ్యుడు నందమూరి తారక రామారావును గుర్తుచేస్తున్నారు. ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1983లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అఖండ విజయం సాధించింది. అదే ఏడాది మే 28న తన పుట్టిన రోజు నాడు విజయవాడలో విపక్షాలతో మహా రాజకీయ సదస్సు నిర్వహించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక ఐక్యకూటమి ప్రయత్నాలకు అది మరో ఆరంభం. 1983లోనే కర్నాటకలో రామకృష్ణ హెగ్డే సారధ్యంలో జనతా పార్టీ ప్రభుత్వం…
రాష్ట్రంలో జరుగుతున్న కోల్ స్కాంపై మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండడం ఎందుకని ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ప్రధానికి.. కోల్ ఇండియాకి ఫిర్యాదు చేశాం. డీవోపీటీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీధర్ ని సీఎండీగా కొనసాగిస్తున్నారు. 50 వేల కోట్ల దోపిడీకి పాల్పడుతోంది. ప్రధాని, కోల్ సెక్రెటరీ లకు ఫిర్యాదు చేశాం. కేంద్ర మైనింగ్ మినిస్టర్ కి ఫిర్యాదు చేస్తే..మేము చేసేది ఏమీ లేదు ప్రధాని కార్యాలయం చూసుకుంటుంది అని చెప్పారు. సెంట్రల్…
సర్జికల్ స్ట్రయిక్స్కు సాక్ష్యమేదీ? అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించడంపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు.. తెలంగాణ బీజేపీ నేతలతో పాటు.. ఇతర రాష్ట్రాల వారు కూడా కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ… డియర్ కేసీఆర్, ఇదిగో మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ వీడియోగ్రాఫిక్ సాక్ష్యం అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.. అయినప్పటికీ మీరు సాయుధ బలగాల…