IPS Love Stroy: ఐపీఎస్ అధికారుల లవ్ స్టోరీ.. బిష్ణోయ్, అన్షిక వర్మలు ఎవరు.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPS Love Stroy: ఉత్తర్ ప్రదేశ్‌లో యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ అధికారులుగా పేరు తెచ్చుకున్న ఇద్దరి ప్రేమకథ ఆ రాష్ట్రంలో వైరల్ అవుతోంది. ఉద్రిక్తతలకు మార్పు పేరుగా ఉన్న సంభాల్ జిల్లా ఎస్పీగా ఉన్న కృష్న కుమార్ బిష్ణోయ్, బరేలీ ఎస్పీగా ఉన్న అన్షిక వర్మలు వివాహం చేసుకోనున్నారు. రాజస్థాన్‌లో వీరిద్దరి వివాహ వేడుకలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు దగ్గరగా ఉండే ఇద్దరు పోలీస్ అధికారుల వివాహంపై రాష్ట్రంలో చర్చ నడుస్తోంది. మార్చి 27న రాజస్థాన్ బార్మర్‌లో వివాహ వేడుకలు ప్రారంభమవుతాయి. సీఎం మెడల్ అందుకున్న కేకే బిష్ణోయ్, సోషల్ మీడియాలో పాపులర్ ఐపీఎస్‌గా ఉన్న అన్షికా వర్మలు జోధ్‌పూర్‌లో రిసెప్షన్ తర్వాత తమ కొత్త ఇన్సింగ్స్ ప్రారంభిస్తున్నారు.
గోరఖ్‌పూర్‌లో ప్రారంభమైన లవ్ స్టోరీ:
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
ఐపిఎస్ కృష్ణ కుమార్ బిష్ణోయ్ సంభాల్‌కు పోస్టింగ్ ఇచ్చే ముందు 29 నెలల పాటు గోరఖ్‌పూర్‌లో ఎస్పీ సిటీగా పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చాలా సన్నిహితుడిగా భావిస్తారు. సీఎం యోగి గోరఖ్‌పూర్ మఠాన్ని సందర్శించినప్పుడల్లా బిష్ణోయ్ భద్రతా బాధ్యలు చూసుకునే వారు. ఆ సమయంలోనే 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి అన్షిక వర్మను కలిశారు. ఆ సమయంలో ఆమె అక్కడ ఏఎస్పీగా పనిచేసేవారు.
సంభాల్ ఎస్పీగా పేరు:
2024లో సంభాల్‌లో కోర్టు ఆర్డర్‌తో మసీదు సర్వేకు వెళ్లిన అధికారులపై ముస్లిం మూక దాడి చేసింది. ఆందోళనకారుల్లో పలువురు మరణించారు. దీంతో ఒక్కసారిగా సంభాల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఆ సమయంలోనే యోగి ఆదిత్యనాథ్ జిల్లా ఎస్పీగా బిష్ణోయ్‌ను నియమించారు. సంభాల్ హింస తర్వాత నేరస్తులపై చర్యలు తీసుకున్నందుకు ఆయనకు ముఖ్యమంత్రి పతకం లభించింది.
డైనమిక్ బిష్ణోయ్, లేడీ సింగం అన్షికా వర్మ:
బిష్ణోయ్ అద్భుతమైన విద్యా నేపథ్యం కలిగి ఉన్నారు. ఆయన ఫ్రెంచ్ ప్రభుత్వ స్కాలర్‌షిప్ పై పారిస్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ నుండి అంతర్జాతీయ భద్రతలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఐపీఎస్ అధికారి కావడానికి ముందు, ఆయన ఐక్యరాజ్యసమితి (యుఎన్)లో ₹30 లక్షల వార్షిక ప్యాకేజీపై పనిచేశారు. ఆ తర్వాత దేశానికి సేవ చేయాలని ఐపీఎస్ అయ్యారు.
సంభాల్‌లో రూ. 100 కోట్ల విలువైన బీమా కుంభకోణం బయటపెట్టి, 69 మందికి పైగా మాఫియాను జైలులో పెట్టారు. సంభాల్ హింసకు సూత్రధారి అయిన షరీక్ సాథా గ్యాంగ్‌పై చర్యలు తీసుకున్నారు. సంబాల్‌లో 2024 జామా మసీదు హింసను కేవలం రెండు గంటల్లోనే అదుపులోకి తెచ్చారు. హింసకు కారణమైన స్థానిక ఎంపీ జియావుర్ రెహ్మాన్ బార్క్‌తో సహా 2500 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అన్షికా వర్మ ‘‘లేడీ సింగం’’గా పేరు తెచ్చుకున్నారు. ప్రజల సమస్యలపై సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?