డబుల్ బెడ్రూం లబ్దిదారులకు శుభవార్త చెప్పారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా మొగ్దుంపూర్ లో డబుల్ బెడ్ రూం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… డబుల్ బెడ్రూం ఇండ్లు దశల వారీగా ఇస్తామని.. ఎవరికీ అన్యాయం జరుగనివ్వబోమని ప్రకటించారు. ఇది కంటీన్యూయస్ ప్రాసెస్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు కూడా మనము ఇక్కడే బతికి ఉన్నామని చెప్పారు. ఒకప్పుడు రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు ఉన్నాయిగా అప్పుడు రోడ్లు లేవు, నీళ్లు లేవు, ఎవరన్నా పట్టించుకున్నారా అని నిలదీశారు. తెలంగాణ వచ్చినాక ఇప్పుడు ఎలా ఉందని.. రాజకీయం చేయాలి గొడవ చేయాలి అంటే మేము అనాలని ఆగ్రహించారు.
గొప్పలు చెప్పే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న వేరే రాష్ట్రాలలో తెలంగాణా లో ఉన్న పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. బీజేపీ హయాంలో కాళ్లలో కట్టెలు పెట్టె పరిస్థితి నెలకొన్నదని.. కెసీఆర్ మీద చాలా మంది ఏడ్చే వాళ్ళు ఉంటారన్నారు.
కాగా.. May 14, 2022 న సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్‌పేట డివిజన్ బండ మైసమ్మనగర్‌లో రూ.27.20 కోట్ల వ్యయంతో 310 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. వాటిని మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూంలో సకల సదుపాయాలు కల్పించిందని తెలిపారు.
తాగునీటికి ఇబ్బందులు లేకుండా సంప్ నిర్మాణంతో పాటు డ్రైనేజీ, సీసీరోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించామని అన్నారు. అలాగే 11 లిఫ్ట్‌లను సైతం ఏర్పాటు చేశారని, మంత్రులు డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించి, అందజేశామన్నారు.