రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. ఈ వ్యవహారంపై ఓ రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి.. అస్సాం ముఖ్యమంత్రి డీఎన్ఏ ఎంటి అని అడుగుతామన్న ఆయన… అస్సాం పక్కనే చైనా ఉంది కదా.. అసలు ఆయన డీఎన్ఏ చైనాదా? అస్సాందా? అనేది తేలాలన్నారు. ఇక, మాతృత్వాన్ని అవమానించే మాటలు మాట్లాడారంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై ఆగ్రహం వ్యక్తంచేశారు రేవంత్‌రెడ్డి.. భారత్ మాతాకు పుట్టినోల్లా……
సీఎం కేసీఆర్ నేడు జనగామ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు సీఎం కేసీఆర్ జనగామ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం జనగామలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. అయితే టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభ ప్రజల పాలిట భయానక సభగా మారింది. ఎందుకంటే.. టీఆర్ఎస్ సభతో హైదరాబాద్ వరంగల్ హైవే పైనా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్‌లో అంబులెన్స్ ఇరుక్కుపోయింది. దారి లేక ప్రాణాపాయ స్థితిలో ఉన్న…
ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై నిన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు నుండి ఈ నెల 10తేదీ వరకు అంబేద్కర్ విగ్రహల వద్ద నిరసనగా కార్యక్రమాలు చేపడతామన్నారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తో రాజ్యాంగంపై చర్చించేందుకు ఎమ్మార్పీఎస్ సిద్ధంగా ఉందన్నారు. పాలకులు తమ వైఫల్యాలను, రాజ్యాంగంపై ఆపాదించడం సీఎం కేసీఆర్ నిరంకుశత్వానికి…
కేంద్రం ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థల తీరును కేసీఆర్ తప్పు పట్టారని, కానీ ఐఏఎస్ ఐపీఎస్‌ల వ్యవస్థను కేసీఆర్ ధ్వంసం చేసిన చరిత్ర కేసీఆర్‌కే దక్కుతుందని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం తప్పేనని ఉత్తమ్ అన్నారు. 14 మంది ఐఏఎస్‌లను తప్పించి.. వేరే రాష్ట్రానికి చెందిన వాళ్లను సీఎస్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.…
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడలు చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇవ్వకపోగా అరెస్టులు చేసి జైల్లో పెడతారా..? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాగే నిర్భందం కొనసాగిస్తే ప్రతిఘటన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాయకులపై దాడులు, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడానికి…
నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని..అందరరం కలిసి కేసీఆర్ అంతు చూద్దామని బండి సంజయ్ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ తేల్చిందని బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ తెలిపారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన సీఎం కేసీఆర్‌పై కేసులు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. Read Also:…
కేంద్రంపై మరోసారి పోరాటానికి సిద్ధం అవుతోంది టీఆర్ఎస్ పార్టీ.. దానికి పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకోబోతోంది.. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఇందులో భాగంగా ఇవాళ పార్టీ ఎంపీలకు కీలక సూచనలు, దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్.. పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ…
ఈనెల 31 నుంచి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కరోనా నేపథ్యంలో రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి దశ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరుగుతాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలను నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో…
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో నాగారం మండలం, తిరుమలగిరి మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటించారు. నాగారంలోని మండల కేంద్రంలో కడియం సోమక్క వెంకయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘునందర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తుంగతుర్తి ప్రాంతంలోని తిరుమలగిరి ప్రాంతాన్ని దళితబంధుకు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం…