అసలు ముందస్తుకు వెళ్లే ఆలోచనే లేదని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో అసెంబ్లీ స్థానాల్లో సర్వేలు జరుగుతున్నాయని తెలిపారు.. ఆరు నూరైనా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమన్న ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. అయితే, కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ నేతలు. ఎన్నికలు, సీట్లపై స్పందించిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్… కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్…
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆకస్మిక మరణం పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మల్లు స్వరాజ్యం మరణంతో ఆసుపత్రికి చేరుకున్నారు సీపీఎం నేత, మాజీ ఎంపీ మధు. ఆమె మరణానికి తీవ్ర సంతాపం తెలిపారు. స్వరాజ్యం మరణం తీరని లోటు. భూస్వామ్యక కుటుంబంలో పుట్టిన పోరాట యోధురాలుగానే ఆమె నడిచింది. ఆమె జీవితం ప్రజల కోసం అర్పించింది అన్నారు మధు. మల్లు స్వరాజ్యం ఆకస్మిక మృతికి సంతాపం తెలిపారు ఏపీ సీఎం జగన్మోహన్…
మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా మరోసారి కేంద్రం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. కార్వాన్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. కంటోన్మెంట్లో చెక్ డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతోందన్నారు.. ఇక, శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్ఐ అనుమతి ఇవ్వడం లేదనన్ ఆయన. ఇలా కంటోన్మెంట్, ఏఎస్ఐ అభివృద్ధికి అడ్డు పడుతోందని…
వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినట్టు వెల్లడించారు మంత్రి హరీష్రావు.. మెదక్ లోని జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన రజకుల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 33 జిల్లాల్లో రెండేసి కోట్లతో మోడ్రన్ దోబీ ఘాట్ లు నిర్మిస్తామని తెలిపారు. వృత్తి పైనా ఆధారపడ్డ రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని గుర్తుచేసిన ఆయన.. 80 శాతం సబ్సిడీతో రజకులకు సబ్సిడీ లోన్లు…
నేడు ఢిల్లీకి ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్ నేడు శాసనసభలో ఏపీ వార్షిక బడ్జెట్ ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. 2022-23 బడ్జెట్ ఆమోదానికి సమావేశం. ఇవాళ్టి నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం. నల్లగొండ జిల్లా కొండపాకగూడెం నుంచి పాదయాత్ర. ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా ఏపీలో ఉదయం 11 గంటలకు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి కన్నబాబు నేడు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ సవాల్…
చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు గాను సినీ పరిశ్రమ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే దర్శక ధీరుడు రాజమౌళి ఈ విషయం మీద కాస్త ఆలస్యంగా స్పందించారు. కొత్త G.Oలో సవరించిన టిక్కెట్ ధరల ద్వారా తెలుగు సినిమాకి సహాయం చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పేర్నినాని గారికి ధన్యవాదాలు. ఈ జీవో సినిమా పరిశ్రమ మళ్లీ…
సీఎం కేసీఆర్.. అసెంబ్లీలో బడ్జెట్ పై ప్రసంగించబోతున్నారు. నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నారు.. అందరూ తన ప్రసంగం వినాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీపై.. నిరుద్యోగుల్లో మొదటి నుంచి అసంతృప్తి ఉంది. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని ప్రచారం చేశారని… ఈ హామీ నిలబెట్టు కోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇటు విపక్షాలు, అటు నిరుద్యోగులు ఆందోళనబాటలో ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ ఉద్యమ స్లోగన్. ఇందులో మొదటి రెండింటి విషయంలో న్యాయం జరిగిందన్న…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్రవిమర్శలు చేశారు. ఫామ్ హౌస్ లో ఉన్న కెసిఆర్ ను బీజేపీ గళ్ళ పట్టి గుంజుతేనె బయటకు వచ్చాడన్నారు. జైలుకు పోతానన్న భయంతోనే దేశంలో కెసిఆర్ తిరుగుతున్నాడు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ కు ఇంటిపోరు ఎక్కువైంది. బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అమలు చేసి తీరుతాం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమ కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరు. లాఠీలు కొనటానికి.. కొత్త జైళ్ళు…
జాతీయస్థాయిలో మరో కొత్త ఫ్రంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.. బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.. అయితే, కొందరు ఇప్పటికే కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఉండబోదని స్పష్టం చేశారు. ఏదేమైనా మరో ఫ్రంట్పై చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.. అయితే, మీడియా చిట్చాట్లో టి.పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. కేసీఆర్ ఫ్రంట్ సినిమాకు డైరెక్టర్ (ప్రశాంత్ కిషోర్) పీకే, ప్రొడ్యూసర్ నరేంద్ర మోడీ.. నటుడు కేసీఆర్ అంటూ ఎద్దేవా…
జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతీ దశలో వారు మాకు వెన్నంటే శిబూ సొరేన్ ఉన్నారు.. వారిని కలిసి, ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంది.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాకు శిబు సోరెన్ని కలిపించడం చాలా సంతోషాన్ని కలిగించింది. నేను వారి ఆశీర్వాదం తీసుకున్నాని తెలిపారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, మంచి అభివృద్ధి సాధిస్తున్నందుకు వారు సంతోషం…