తుక్కుగూడ బీజేపీ సభలో అమిత్ షా టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.. దీనిపై ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ స్పందించారు. అమిత్ షా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల చేతుల్లో బీజేపీ స్టీరింగ్ ఉందని మండిపడ్డారు.
జనం గోస – బీజేపీ భరోసా అంటే జనాలను గోస పెడతామని కచ్చితమైన భరోసా బీజేపీ ఇచ్చిందని అన్నారు. ఎస్సి రిజర్వేషన్ల ఫైల్, ఎస్టీల ఫైల్, బీసీ జనగణన ఫైల్ కేంద్రం దగ్గరే పెట్టుకుందని మండి పడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.
మన నీళ్లు మన దగ్గర నుంచి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యంగ బద్దంగా ఇవ్వాల్సిన నిధులే సక్రమంగా ఇవ్వడం లేదని, నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో కేంద్రం మాట తప్పుతోందని పేర్కొన్నారు. నరేగా నిధుల విషయంలో 18 వేల కోట్లు అని amit షా అంటే, 30 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని కిషన్ రెడ్డి చెబుతున్నారు.
ఎవరు చెప్పింది నిజమని నిలదీశారు. తెలంగాణలో తుగ్లక్ పాలన అంటున్నారు! నల్ల చట్టాలు తెచ్చింది ఎవరు? రైతులకు క్షమాపణ చెప్పింది ఎవరు? అని ప్రశ్నించారు. భారతదేశంలో తుగ్లక్ పాలన జరుగుతుందా లేదా అనేది ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.
ఇక.. తుక్కుగూడ బీజేపీ సభలో అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడాడని.. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 బిల్ విషయంలో టిఆర్ఎస్ పై చేసిన అమిత్ షా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. హోంమంత్రి స్థాయిలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు.
బీజేపీ ఎనిమిదేళ్ళలో తెలంగాణకు ఏం చేసింది ? టిఆర్ఎస్ ది కుటుంబ పాలన అంటున్న పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సిందియా, వసుంధర రాజే, బీవై విజయేంద్ర, వరుణ్ గాంధీ ఇంకా అనేక మంది బీజేపీలో ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పోరాటం చేసిన కేటీఆర్ తెలంగాణ పాలనలో భాగస్వాములు కావొద్దంటా? ఎలాంటి పోరాటం చేయని బీజేపీ నేతలు రాజకీయాల్లో కొనసాగొచ్చా ? అని నిలదీశారు.
Akshay Kumar: మరోసారి కరోనా బారిన స్టార్ హీరో.. కేన్స్ ఫెస్టివల్‌కు దూరం