కోవిడ్ ఆర్థిక పరిస్థితులు, ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని, ఆ ఎఫెక్ట్ అమెరికా వంటి దేశాలతో పాటు భారత్ పై కూడా పడిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కొద్ది రోజుల కింద ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్రం ఛార్జీలు తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాట్ తగ్గించలేదు. అటల్ బిహారీ వాజ్ పేయి ఫౌండేషన్ స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బీజేపీ నేత విజయశాంతి.
అన్ని రాష్ట్రాలు తగ్గించిన తెలంగాణ ప్రభుత్వం మాత్రం తగ్గించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రజల బాధలు తెలుసుకొని పెట్రోల్, డీజిల్ పై భారం తగ్గించింది. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా పెట్రోల్, డీజిల్ పై పన్నులు వసూలు చేస్తోందని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ డిల్లీకి వెళ్లడం వల్లే పెట్రోల్, డీజిల్ తగ్గించారని ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబానికి చీదరింపు తప్పదన్నారు.
అందుకే ఇక్కడి రైతులను ఆదుకోవాల్సింది పోయి వదిలేసి పంజాబ్ రైతులను కలుస్తున్నారు. కేసీఆర్ అమెరికా అధ్యక్షుడిని కలిసినా, పాకిస్థాన్ అధ్యక్షుడిని కలిసినా మేము భయపడం. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం నిరుపేదల కోసమే. కేసీఆర్ కు దీనిపై కనీస అవగాహన లేదు. కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు.. ఏమైంది? మాకు కేసీఆర్ సర్టిఫికేట్ అక్కర్లేదు. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తా అన్నారు.. కానీ అవన్నీ ప్రగతి భవన్ కే పరిమితం అయ్యాయని ఎద్దేవా చేశారు.
Bandi Sanjay: జనం గోడు పట్టించుకోకుండా కేసీఆర్ టూర్లా?