రాష్ట్రంలో ప్రజలందరూ అనేక సమస్యలతో బాధపడుతుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి మాత్రం దేశమంతా తిరుగుతున్నాడని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జిల్లా బీజేపీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు.
రాష్ట్ర ప్రజల ఇబ్బందులను గుర్తించే స్థితిలో ముఖ్యమంత్రి లేడు. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 30 రూపాయల జీఎస్టీ విధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 65 వేల కోట్లు లబ్ధి పొందింది. ఆర్టీసీ తక్కువ రేటు లభిస్తుండడంతో ఇతర రాష్ట్రాల్లో కొంటుంది. రాష్ట్రంలో జీతాలు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితులున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మరణించిన వారికి సహాయం చేస్తే ఇక్కడి ప్రజలను ఎవరు కాపాడాలి.
రాష్ట్రంలో ఒక్కొక్కరిపై లక్ష రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడు. బీజేపీ పెరుగుదలను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్రెషన్ లోకి వెళ్ళాడు. సీఎం ఆఫీస్ లాగా కాసులకు కక్కుర్తి పడే అధికారులు పీఎంవో ఆఫీస్ లో లేరు . జిమ్మిక్కులు చేస్తూ రాష్ట్రంలో ఒక నెల పెన్షన్ డబ్బులను ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్. వడ్లను తక్కువ ధరకు అమ్ముకుని రైతులను వద్దంటే పంట వేయని రైతులను ఇద్దరిని ప్రభుత్వం ఆదుకోవాలి.
కొనుగోలు కేంద్రాల్లో సరియైన సిబ్బంది, వసతులు లేవు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు 6 నుంచి 10 కిలోలు కట్ చేస్తున్నారు. అడ్డదారిలో పైసలు సంపాదించిన వారందరినీ సీఎంవో ఆఫీస్ లో పెట్టుకున్నారు. కొడుకేమో డబ్బు దోచుకుని విదేశాల్లో పెట్టడానికి వెళితే తండ్రేమో మోడీ వస్తే మొఖం చెల్లక పోయిండు. ఫామ్ హౌస్ లో నుండి ముఖ్యమంత్రి బయటకు రావడమే సంచలనం. ఏడు సంవత్సరాలు రైతులు పండించిన ప్రతి గింజ కొంటున్నానని ముఖ్యమంత్రి అబద్ధం చెప్పాడు. ఇప్పుడేమో కేంద్రం కొనడం లేదని అంటున్నాడన్నారు.
Pattabhi: సీబీఐ కోర్టు అనుమతులను జగన్ ఉల్లంఘించారు