కేసీఆర్ ట్రాప్ లో పడను.. టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేసారు. రాజీనామా తోనే నియోజక వర్గ అభివృద్ధి జరుగుతుంది అంటే… దళిత బందు ఇచ్చినప్పుడే.. రాజీనామా చేస్తా అని ప్రకటించారు. నన్ను గెలిపించిన ప్రజల కోసం అసెంబ్లీ లో ఎన్నో సార్లు మాట్లాడిన అంటూ గుర్తు చేసారు. కెసిఆర్ అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోయినా, అసెంబ్లీ లో కలిశా అంటూ పేర్కొన్నారు. శివన్న గూడెం ప్రాజెక్టు ముంపు రైతులకు…
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్ చేసారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్ట్ లు, చెరువులు, కుంటల్లో పరిస్థితిపై సీయం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా…
బీజేపీ జెండాను చూస్తేనే టీఆర్ఎస్ నేతలు గజగజ వణికిపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతారను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కామారెడ్డి జిల్లాలో బీజేపీ శ్రేణులపై టీఆర్ఎస్ మూకలు బరి తెగించి దాడికి పాల్పడటం హేయనీయమని మండిపడ్డారు. జనం గోస- బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీలతో గ్రామాల్లోకి వెళుతూ ప్రజాస్వామ్య బద్దంగా కార్యక్రమాలు…
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. ఈనేపథ్యంలో.. నిన్న రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో కొత్తగూడెంకు బయల్దేరి వెళ్లారు గవర్నర్. అయితే.. అక్కడి నుంచి భద్రాచలంలో గోదావరి వరద కారణంగా జిల్లాలో ఉత్పన్నమైన పరిస్థితులను పరిశీలించడంతో పాటు వరద బాధితులతో గవర్నర్ మాట్లాడనున్నారు. అయితే.. భద్రాచలం టౌన్ తో పాటు చుట్ట పక్కల ముంపు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. గోదావరి…
ఆ నాయకుడు బీజేపీలో కొత్త సంప్రదాయానికి తెర లేపారా? వచ్చే ఎన్నికల్లో పలానా చోటు నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంలో ఆంతర్యం ఏంటి? అధిష్ఠానం చెప్పిందా.. లేక ఆయనే అడ్వాన్స్ అయ్యారా? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీలో ఎంతటి పెద్దవాళ్లయినా సరే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుంది. ఆ అధికారం రాష్ట్ర పార్టీ చేతిలో కూడా ఉండదు. అందుకే ఈ విషయంలో బీజేపీ నేతలు ఎవరూ…
ప్రెస్ మీట్లు కాదు.. ప్రజల ఇబ్బందులపై సమీక్ష చేయండని ఎంపీ దర్మపురి అరవింద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాతూ.. 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమవుతోందని పేర్కొన్నారు. చెరువులు, రిజర్వాయర్లు కూడా పూర్తిగా నిండిపోయాయని తెలిపారు. ముందే జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది ప్రజలను కాపాడొచ్చని సలహా ఇచ్చారు. ఇరిగేషన్ అధికారులు, జిల్లా అధికారుల సమన్వయ లోపం కళ్ళకు…