Ram Gopal Varma: ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ కంటే కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఏ విషయంపై ట్వీట్ చేస్తాడో ఎవరికి అర్ధం కాదు.. ఒకసారి హీరోయిన్ల బికినీ ఫోటోలపై కామెంట్స్ చేస్తాడు.. ఇంకోసారి స్టార్ హీరోల మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడతాడు.. ఇంకోసారి రాజకీయాలను సినిమాలను పోల్చి తనదైన స్టైల్లో సెటైర్లు, కౌంటర్లు వేస్తూ ఉంటాడు. ఇక వర్మ ఏ ట్వీట్ చేసినా వివాదమే అని చెప్పాలి. ఇక తాజగా వర్మ మరో వివాదాన్ని క్రియేట్ చేసే పనిలో పడ్డాడా..? లేక రాజకీయాలలోకి వచ్చే ప్లాన్ ఏమైనా చేశాడా..? అన్న అనుమానాలు వస్తున్నాయి. అలాంటి అనుమానాలకు తావు ఇచ్చింది ప్రస్తుతం వర్మ వేసిన ట్వీట్. సినిమాలో ఉన్న హీరోలందరూ రీల్ పాన్ ఇండియా స్టార్లు అయితే కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అంటూ వర్మ కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తాడు.
“బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ మరియు కెజిఎఫ్ 2 యొక్క అడుగుజాడలను అనుసరించి, టిఆర్ఎస్ కూడా బిఆర్ఎస్ గా పాన్ ఇండియా వైపు వెళ్తోంది. హీరోలు యశ్, ప్రభాస్, తారక్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లా కాకుండా రియల్ పొలిటికల్ స్టార్ కేసీఆర్”అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ వెనుక వర్మ ఆంతర్యం ఏంటి అనేది మిస్టరీగా మారింది. తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలోసత్తా చాటుతున్నట్లు.. కేసీఆర్ సైతం జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే గత కొన్నిరోజులుగా కేసీఆర్ జాతీయ స్థాయి రాజాకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే వర్మ ఈ ట్వీట్ చేశాడా..? అనేది చాలామంది అనుమానం. ఏదిఏమైనా వర్మ చెప్పినదాంట్లో నిజం లేకపోలేదు అంటున్నారు కొందరు. మరి ఈ ట్వీట్ వెనుక ఉన్న మర్మం ఏంటో వర్మ చెప్తే బావుంటుందేమో అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
Following the footsteps of BB, RRR, PUSHPA and KGF 2 , TRS too goes PAN INDIA as BRS ..Unlike the REEL FILM STARS #Yash #Tarak #prabhas #RamCharan #AlluArjun the REAL PAN INDIA POLITICAL STAR is #KCR 💐
— Ram Gopal Varma (@RGVzoomin) September 27, 2022
- Tags
- kcr
- ntr
- prabhas
- ram gopal varma
తాజావార్తలు
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!