డబుల్ ఇంజన్ పాలన అంటే తిరోగమన పాలన అంటూ బీజేపీ పై మంత్రి హరీష రావు మండిపడ్డారు. అమిత్ షా నిధులు మీకు అందాయా అని అడిగే కంటే ముందు, తెలంగాణ కు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా చెప్పండని ప్రశ్నించారు. నియామకాల గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపి కి లేదని మండిపడ్డారు. మోడీ రెండు కోట్ల ఉద్యోగాల నియామకాల ప్రకటన బోగస్ అంటూ విమర్శించారు. మా వైపు ఒక్క వేలు చూపిస్తే.. మీ వైపు రెండు…
టీఆర్ఎస్ నేతలు బావిలో కప్పలా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎద్దేవ చేసారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని జెపీ నడ్డా తెలిపారని అన్నారు. నిన్నటి ప్రధాని సభ గ్రాండ్ సక్సెస్ అయిందని ఈటెల రాజేందర్ హర్షం వ్యక్తం చేసారు. బోనాలకు వచ్చినంత జనాలు రాలేదని రాష్ట్ర మంత్రులు మాట్లాడడం వారి అవివేకం అని మండిపడ్డారు. పార్టీ మీటింగ్ ని బోనాలతో పోల్చడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అధికారంలోకి…
కేసీఆర్ ఎవరు కౌన్ కిస్కా.. అంటూ.. బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నగరంలో పర్యటన ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు వద్ద సోమవారం ప్రధాని మోదీకి బండి సంజయ్ వీడ్కోలు పలికిన అనంతరం ఎయిర్పోర్టులో బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పారని , బీజేపీ.. కేసీఆర్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు.. ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని…
లా అండ్ ఆర్డర్ మాది లేకపోతే మీ వాళ్ళు తిరిగే వాళ్ళా అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీ శ్రేణులపై మండిపడ్డారు. బీజేపీ కేంద్రం ఏమిచ్చిందో శ్వేతా పత్రం ఇవ్వాలని కోరారు. తెలంగాణ లో ఆలయాల గురించి మాట్లాడారు కదా.. మరి దేవాలయాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు తలసాని. ధాన్యం కొనుగోలు గురించి ఇప్పటికి ఇంకా సందిడ్గం కొనసాగుతూనే వుందని అన్నారు. సింగిల్ ఇంజన్ సర్కార్ తోనే అన్నీ…
రాష్ట్రం పై రాక్షసులు పడ్డట్టు బీజేపీ నేతలు దాడి చేస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు. మోదీ కంటే ముందే సీఎం కేసీఆర్ రాజకీయాల్లో వచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్న నాయకుడు మంత్రి కేటీఆర్ అని వెల్లడించారు. అంతేకాకుండా.. ఆర్థిక క్రమశిక్షణను తెలంగాణ అద్భుతంగా పాటిస్తున్నదని చెప్పారు. కాగా.. కేంద్రం ఇస్తున్న అవార్డులే తెలంగాణ ప్రగతికి నిదర్శనమని వివేకానంద చెప్పారు. read…
నేడు ప్రధాని మోడీ హైదరాబాద్ కు రానున్నా విషయం తెలిసిందే.. అయితే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు ఆదివారం జరిగే బహిరంగ సభలోను ఆయన ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంతో రాష్ట్రానికి వస్తున్న ప్రధానికి స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ వెళ్లడం లేదు.. ఆయకు బదులుగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహరించనున్న విషయం తెలిసిందే. దీనిపై తలసాని తనే వెళ్లనున్నట్లు ప్రకటించారు కూడా. అయితే…
నేడు విపక్షాల రాష్ట్ర పతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ తో పటు పలువురు టీఆర్ఎస్ నేతలు స్వయంగా బేగంపేట ఎయిర్పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలికారు. కాగా.. టీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హన్మంతరావు యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకడం ఆసక్తికరంగా మారింది. అయితే.. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పిలిపించిన వారితో మేము…
సినీ నటుడు రాజకీయ నాయకుడు ప్రకాశ్ రాజ్ మరోసారి బీజేపీపై సెటైర్లు వేశారు. భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు సంబంధించి హైదరాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి పరోక్షంగా ఆయన విమర్శించారు. ప్రధాని పేరు ప్రస్తావించకుండా డియర్ సుప్రీం లీడర్, హైదరాబాద్ కు స్వాగతం అంటూ ట్వీట్ చేస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పాలన సాగుతోందని ప్రకాశ్ రాజ్ కితాబిచ్చారు. అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోడీ పర్యటనల సందర్భంగా రోడ్లు వేయడానికి ప్రజలు…