Smita Sabharwal Tweet: సీఎం కేసీఆర్ కార్యదర్శి స్మితా సభర్వాల్ ట్వీట్ మరోసారి చర్చకు దారితీసింది. రాష్ట్ర దసరా ఉత్సవాల నేపథ్యంలో ఆమె నిన్న బుధవారం వివిధ రాష్ట్రాల్లో స్త్రీ, పురుష నిష్పత్తిని తెలిపే ఇండియా మ్యాప్ ను పోస్టు చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. కానీ.. స్త్రీ, పురుష నిష్పత్తి మాత్రం రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉందన్న ఈ మ్యాప్ ఆసక్తికరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఆమ్యాప్ లో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా, ఢిల్లీ రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళల జనాభా తక్కువ ఉంది.
Since many of you found the tweet not acceptable, I delete it with apologies. Intention was not to hurt any sentiments.#Happy festivities to all 🙂🙏
Jai Hind 🇮🇳— Smita Sabharwal (@SmitaSabharwal) September 28, 2022
అయితే.. ఆమె పోస్ట్ చేసిన మ్యాప్ లో కశ్మీర్ సంపూర్ణంగా లేదని కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఆమె పోస్ట్ కు తీవ్ర విమర్శలు రావడంతో.. సభర్వాల్ తన పోస్టును తొలగించారు. అంతేకాకుండా.. క్షమాపణ తెలిపారు. స్మిత సభర్వాల్ ట్వీట్ డిలీట్ చేయడంతో.. ఆమెకు చాలామంది మద్దతుగా నిలిచారు. ఆమె పోస్ట్ చేసిన మ్యాప్ తప్పు కావచ్చు కానీ, ఆమె భావన చాలా గొప్ప దంటూ ప్రశంసలు కురిపించారు. ఆమె తప్పుగా ట్వీట్ చేయలేదని ఒక్కసారి మానవత్వంతో గమనించండి అంటూ మరికొందరు పోస్ట్ చేస్తే.. అది తప్పని తెలిసాక డిలీట్ చేసారు అది ఆమె గొప్పతనం అంటూ నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆమె తమకు మద్దతుగా నిలిచిన వారందరికి కృతజ్క్షతలు తెలిపారు.
గత నెలలో (ఆగస్టు 19 2022) బిల్కిస్ బానో కేసులో దోషులను ఉత్త రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడంపై సభర్వాల్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇక స్మితా సబర్వాల్ ట్వీట్ చేస్తూ, “ఒక మహిళగా.. సివిల్ సర్వెంట్‌గా, నేను #BilkisBanoCase వార్తలను చదువుతూ అవిశ్వాసంతో కూర్చున్నాను..భయం లేకుండా స్వేచ్చగా ఊపిరి పీల్చుకునే ఆమె హక్కును మనం మళ్లీ కొట్టివేయలేము. అయితే, మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా చెప్పుకోలేమంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా.. ఆమె బిల్కిస్ బానో తరపున విడుదల చేసిన ఒక ప్రకటనను కూడా జత చేశారు. దీంతో..ఈ ట్వీట్‌పై రాజకీయ నేతలతో పాటు నెటిజన్ల నుంచి తీవ్ర స్పందన వచ్చింది. ఇక కొంతమంది నెటిజన్లు ఆమె ప్రతిచర్యలపై ‘సెలెక్టివ్’గా , ‘రాజకీయ వ్యాఖ్యలు’ చేసినందుకు ఆమెపై విరుచుకుపడగా.. మరికొందరు గుజరాత్ ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే ఏకైక సివిల్ సర్వెంట్‌గా ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు.
Mahesh Babu: మహేశ్ ఇంట్లో చోరీకి యత్నం.. గోడ దూకి గాయపడ్డ దొంగ