People of other states are laughing at KCR’s behaviour: కేసీఆర్ తీరు చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు నవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవ చేశారు. డబ్బుల సంచులు పట్టుకొని కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్ల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. ఆ కార్యాలయాల్లో అధికారులు ఈగలు కొట్టుకుంటున్నారని అన్నారు. గులాబీ దండు గుండాయిజం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయ్.. చేతలు ప్రగతి భవన్, ఫామ్ హౌస్ దాటడం లేదని ఎద్దేవ చేశారు. నిరుద్యోగ భృతి ఏమైంది? అని ప్రశ్నించారు. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం ఇచ్చే స్కాలర్ షిప్స్ అందకుండా కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ విద్యార్థుల పేర్లు, అకౌంట్ నెంబర్లు కేంద్రానికి ఇస్తే స్కాలర్ షిప్స్ అందుతాయని అన్నారు. విద్యావ్యవస్థ, గురుకులాల్లో కనీస వసతులు లేవని మండిపడ్డారు. తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లపై ధర్నా చేస్తున్నారు. తెలంగాణలో అప్పులు తేకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని కిషన్ రెడ్డి అన్నారు.
Read also: Kishan Reddy: మోడీని తప్పు పట్టే విధానాలను పక్కన పెట్టి.. తెలంగాణ సంగతి చూడండి
రేషన్ బియ్యం 90 శాతం కేంద్రమే ఇస్తుందని అన్నారు. పేదలకు కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని కూడా అందించలేదు. కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఎద్దేవ చేశారు. ఆగస్టు నెలలో GST వసూళ్లు 1.6 లక్షల కోట్లకు పెరిగింది అని గుర్తు చేశారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లపై గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేయలేని పరిస్థితి వస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్కం లు దివాళా తీసే పరిస్థితి వస్తుందని తీవ్ర విమర్శలు చేసారు. విద్యుత్ సంస్కరణలు విద్యుత్ ఉత్పత్తి సంస్థల పరిరక్షణ కోసమే అన్నారు. విద్యుత్ సంస్థలు దెబ్బ తింటే దేశం కుప్పకూలుతుందని అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని టీఆర్ఎస్ నేతలు నిరుద్యోగులను మోసం చేశారు. దేశం నుంచి ఎక్స్ పోర్ట్స్ పెరిగాయని అన్నారు. వ్యాక్సిన్ ను 100 దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. డిఫెన్స్ రంగం నుంచి 15 వేల కోట్ల ఎక్స్ పోర్ట్స్ పెరిగాయని అన్నారు. బిజేపీ చెప్పింది చేస్తుంది.. చేసేది చెబుతోంది. కేసీఆర్ తన కుటుంబం గురించి ఆలోచన చేస్తారు.. బీజేపీ ప్రభుత్వం మేకిన్ ఇండియా గురించి ఆలోచిస్తామన్నారు. టీఆర్ఎస్ నేతలు చెప్పింది చేయరు.. చేయంది చెబుతారు.