ఇటీవల టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయాల్లో హీటు పెరిగింది. ముఖ్యంగా బండి సంజయ్కాం, గ్రెస్ పీసీసీ అధ్యక్షుల మధ్య మాటల ఘర్షణ మీడియా ఫోకస్‌లోకి వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల ఇచ్చిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల పరిపాటిపై తీవ్ర చర్చలను రేకెత్తిస్తున్నాయి.
Minister Seethakka : తెలంగాణలో అవినీతి దోపిడి చేసినవారిపై ఉక్కుపాదం మోపాలని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని బత్తులపల్లిలో పర్యటించిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో స్కీముల పేరుతో భారీ స్కామ్‌లు జరిగాయని ఆరోపించారు. గొర్రెల పంపిణీ పథకం కింద పేదల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన వారిని ముక్కుపిండి తిరిగి ఆ డబ్బులు రికవరీ చేస్తాం అంటూ సీతక్క ఘాటుగా స్పందించారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం…
పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగాల్లో వివిధ పోస్టులకు ఎంపికైన 922 మందికి అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అభ్యర్థులు నియామక పత్రాలు గురించి దశాబ్దకాలం ఎదురుచూశారన్నారు. ఉద్యోగ బాధ్యత అనిర్వచనీయ ఆనందాయకమని తెలిపారు.
Beerla Ilaiah : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ నేతల తీరును తీవ్రంగా విమర్శించారు. గవర్నర్ ప్రసంగాన్ని అవహేళన చేయడం తగదని, కనీసం గవర్నర్ ప్రసంగాన్ని గౌరవించే సంస్కృతి కూడా బీఆర్‌ఎస్ నేతలకు లేదని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ముందుగా అసెంబ్లీకి హాజరై సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రభుత్వ విప్ సూచించారు. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్…
బడుగు బలహీనర్గాలకు న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక మహసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు." కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆరె కటికల పాత్ర ఉంది. బడుగు బలహీనర్గాలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడొ యాత్ర చేపట్టారు. బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలని కుల సర్వే జరగాలనేది రాహుల్ గాంధీ ఆశయం.
TPCC Mahesh Goud: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పరెడ్డి గూడ గ్రామంలో ప్రజా పాలన లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాల ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నాయకులు కుసుమ కుమార్, శివసేనా రెడ్డి తదితరులు హాజరయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లబ్దిదారులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,…
Revanth Reddy On Rythu Bharosa: తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. రైతు భరోసా పథకంపై వివిధ అంశాలను ఆయన వెల్లడించారు. రైతు భరోసా పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ఇందిరాగాంధీకి ఉన్న చరిత్ర అందరికీ తెలుసునని అన్నారు. రైతు బందు ఉద్దేశం వ్యవసాయ పెట్టుబడికి సహాయం చేయడమని ఆయన అన్నారు. గత ప్రభుత్వం రైతు…
Speaker Gaddam Prasad Kumar: గత ప్రభుత్వం జిల్లా పరిషత్ భవనం కోసం ఆర్డర్ కాగితం మాత్రమే ఇచ్చిందని నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ఆయన పేర్కొన్నారు.
ప్రజల కోసం ప్రజా సమస్యల మీద దేశం కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అధినేతగా తమ నాయకుడు మొదటిసారి ఖమ్మం జిల్లాలోకి అడుగు పెడుతుంటే.. బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేక ఎక్కడికక్కడ నిర్బంధంతో చెక్ పోస్ట్ లు పెట్టి నిర్భందిస్తున్నారు అని ఆమె మండిపడ్డారు.