Minister Seethakka : గొర్రెల స్కామ్‌పై సీతక్క ధ్వజం.. కేసీఆర్ పాలనలో స్కాములపై కఠిన చర్యలు తప్పవు..
- స్కామ్ చేసినవారికి సీతక్క హెచ్చరిక
- ఏసీబీ దాడులు, కీలక ఆధారాలు
- పరారీలో నిందితులు, లుక్‌ఔట్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka : తెలంగాణలో అవినీతి దోపిడి చేసినవారిపై ఉక్కుపాదం మోపాలని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని బత్తులపల్లిలో పర్యటించిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో స్కీముల పేరుతో భారీ స్కామ్‌లు జరిగాయని ఆరోపించారు. గొర్రెల పంపిణీ పథకం కింద పేదల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన వారిని ముక్కుపిండి తిరిగి ఆ డబ్బులు రికవరీ చేస్తాం అంటూ సీతక్క ఘాటుగా స్పందించారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా, వినూత్నంగా అమలు చేయబోతోందని ఆమె స్పష్టం చేశారు.
Bhatti Vikramarka : కేంద్ర కులగణన ప్రకటనపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
అంతేకాదు.. కేసీఆర్ హయాంలో స్కీమ్‌లన్నీ స్కామ్‌లుగా మారాయి. అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదు. ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న ప్రతీ ఒక్కరిని చట్టం ఎదుటకి తీసుకొస్తాం అంటూ హెచ్చరించారు. అదే సమయంలో రామప్ప ఆలయం వరల్డ్ హెరిటేజ్‌గా గుర్తింపు పొందిన నేపధ్యంలో ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులకు ఆహ్వానం పంపినట్లు కూడా వెల్లడించారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిద్దాం అని ఆమె పిలుపునిచ్చారు.
Karumuri Nageswara Rao: ప్రధాని మోడీ ఏదో ఇస్తారని ఆశించాం.. కానీ, పవన్‌కి చాక్లెట్ ఇచ్చారు..!
ఇక గొర్రెల స్కామ్‌కు సంబంధించి ఏసీబీ (ACB) దర్యాప్తు వేగం పుంజుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మొయినుద్దీన్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రాల్లో అతని ఖాతా నుంచి భార్య ఖాతాకు భారీగా నిధులు బదిలీ అయినట్లు గుర్తించారు. అయితే ఈ స్కామ్‌లో మొయినుద్దీన్‌తో పాటు ఆయన కుమారుడు ఇక్రముద్దీన్ కూడా కీలక పాత్ర పోషించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇద్దరూ పరారీలో ఉండటంతో వారిని పట్టుకునేందుకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. విచారణ మరింత దిశగా సాగుతుండగా, నిందితుల అరెస్టు కోసం చర్యలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!