ప్రజల కోసం ప్రజా సమస్యల మీద దేశం కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అధినేతగా తమ నాయకుడు మొదటిసారి ఖమ్మం జిల్లాలోకి అడుగు పెడుతుంటే.. బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేక ఎక్కడికక్కడ నిర్బంధంతో చెక్ పోస్ట్ లు పెట్టి నిర్భందిస్తున్నారు అని ఆమె మండిపడ్డారు. బస్సులు రాకుండా బస్సులని ఇవ్వకుండా ప్రైవేటు వెహికల్స్ ను రానీయకుండా చెక్ పోస్ట్ లు పెట్టి ఆపడం ఇది అత్యంత హెయమైనా చర్య అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
Read Also: Fish Curry : గుమగుమాలాడే చేపల పులుసును ఇలా చేసుకోండి.. మొత్తం ఖాళీ చేస్తారు..
బీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారు అని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. ఉద్యోగులను ప్రైవేటు మీటింగ్ లకు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ల్లో కార్యకర్తలుగా ఉపయోగించుకొని.. ఈరోజు పోలీసులను ప్రైవేటు సైన్యంగా వాడుకొని మా సభను అడ్డుకోవాలని చూస్తున్నారు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వ విధానాన్ని తెలంగాణ సమాజం ఖండించాలని సీతక్క కోరారు. బీఆర్ఎస్ నాయకులారా ఇది పద్ధతి కాదు చేతిలో మీ ప్రభుత్వం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఖబద్ధార్ అంటూ సీతక్క సీరియస్ అయింది.
Read Also: Rahul Gandhi: ఖమ్మం పర్యటనలో రాహుల్ గాంధీ రూట్ మ్యాప్ ఇదే..!
బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమాజం రానున్న రోజుల్లో కచ్చితంగా బుద్ధి చెబుతుందని సీతక్క అన్నారు. ప్రజలు కట్టే పన్నులతో వచ్చే జీతంతో మీరు డ్యూటీలు చేస్తున్నారు.. మీకు జీతాలు కేసీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఇంట్లో నుంచి వచ్చింది కాదు.. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించండి నీతీగా డ్యూటీ చేయ్యండి.. పోలీసులు ఒక పార్టీకి తోత్తులుగా మారి మా పార్టీ మీటింగ్ ను విచ్చినం చేసే కుట్రలు చేస్తే ఊరుకునేది లేదు అని సీతక్క అన్నారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకుంటే వారిని తోసుకుంటూ తరుముకుంటూ ముందుకు రావాలని ప్రజలకు కార్యకర్తలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి చేశారు.