తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివర్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటారని.. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చేది లేదని ఆయన జోస్యం చెప్పారు. మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యార్థులు, అమరులను అవమానం చేసేలా ఉందని రేవంత్ ఆరోపించారు. 1200 మంది అమరులు అయితే 500 మందిని మాత్రమే గుర్తించారని.. అమరుల కుటుంబాలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగులను చివరి బడ్జెట్‌లో కూడా…
తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త అందించారు. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్‌లు అందజేస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు పింఛన్ రాని వారికి ఏప్రిల్ నెల నుంచి నగదు అందజేస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి.. కొత్తవి మంజూరు చేస్తామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ సర్కారు పింఛన్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచిందని.. గతంలో ఏడాదికి రూ.800 కోట్లు ఖర్చుచేస్తే కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఏడాదికి ఏకంగా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తోందని…
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన అభయహస్తం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు. ట్విట్టర్ లో ప్రభుత్వంపై విమర్శలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విట్టర్‌లో..పొదుపు సంఘాల మహిళలకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా ఉండాలని YS రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆలోచనల ఫలితమే అభయహస్తం పథకం.2017 వరకు అమలైన పథకంలో మార్పులు తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్ సర్కార్.. Read Also: ఉమ్మడి…
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి మోడీ, కేసీఆర్‌లపై నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా విమర్శనాస్ర్తాలు సంధించారు. రాష్ట్రానికి కేసీఆర్, దేశానికి మోడీ చేసింది ఏమి లేదని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్‌లో షర్మిల. మోదీ, కేసీఆర్ లు ఇద్దరు ఓకే తాను ముక్కలు. మోదీ రాష్ట్రానికి ఇచ్చింది ఏమిలేదు, కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నది లేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ ..ఉద్యోగాలు ఇచ్చింది లేదు కానీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుండు.…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ‘రెవెన్యూ చట్టాలు – ధరణిలో లోపాలపై జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ధరణి పోర్టల్ పై తీవ్రంగా విమర్శించారు. ధరణి పోర్టల్ ప్రారంభమై రెండేళ్లైనా సమస్యలు మాత్రం తీరలేదు. సీఎం మాటలకు… చేతలకూ పొంతన లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులు, మాజీ సైనికాధికారులుసహా ప్రజలు దీనివల్ల అనేక కష్టాలు పడుతున్నా చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటన్నారు.రాష్ట్రంలో ఉన్న మొత్తం…
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 73 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం’ భారత దేశ ప్రధాన లక్షణమని సీఎం అన్నారు. భిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, విలక్షణమైన సామాజిక భిన్నత్వంతో కూడిన ఏకత్వాన్ని ప్రదర్శిచడమే.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశం యెక్క గొప్పతనమని సీఎం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం’.. భారత పౌరుల విశ్వమానవ తత్వానికి, సామాజిక,…
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2017లో ఎరువులు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కసారే ఎరువుల ధరలను 50 శాతం పెంచడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. Read Also: జంటనగరాల…
ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అందించింది. ఆశావర్కర్ల నెలవారీ ప్రోత్సాహకాలను 30శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కింద పనిచేస్తున్న, నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నెలవారీ ప్రోత్సాహకాలతో ఆశావర్కర్ల నెలవారీ జీతం పెరగనుంది. తెలంగాణ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం మేరకు ఆశావర్కర్లు ఇకపై నెలకు రూ.7,500 జీతం బదులుగా రూ.9,750 అందుకోనున్నారు.…
రాష్ర్టానికి అమూల్ సంస్థ రావడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో ఎన్నో సంస్థలు వచ్చాయని, ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయని మంత్రి అన్నారు. ఇప్పుడు అమూల్ సంస్థ రాష్ర్టానికి రావడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని కేటీఆర్ అన్నారు.రాష్ర్ట ప్రభుత్వం, అమూల్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరినట్టు కేటీఆర్ తెలిపారు. Read Also: వైసీపీ పతనం ప్రారంభమైంది: జీవీఎల్ నరసింహరావు ఒప్పందంలో భాగంగా బేకరీ తయారు ప్లాంట్‌ను…
ఇటీవల తెలంగాణలో సినిమా టికెట్ రేట్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. అయితే దీనిపై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 21న తెలంగాణ సర్కారు సినిమా టికెట్ రేట్లు పెంచుతూ జీవో నెం.120 తీసుకువచ్చిందని, అయితే ఇది చిన్న నిర్మాతలను పూర్తిగా నిరాశపరిచిందని వెల్లడించారు. పెద్ద సినిమాకు, చిన్న సినిమాకు ఒకే విధంగా టికెట్ రేట్లు ఉంటే చిన్న సినిమా బతికి బట్టకట్టేదెలా అని నట్టి కుమార్…