PM Modi: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు శక్తివంచన లేకుండా అధికారం కోసం ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఆదివారం కోలార్ ప్రాంతంలో ఆయన ప్రచారం చేశారు. కోలార్ లో జరిగిన సభ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు నిద్రపట్టకుండా చేస్తుందని అన్నారు. ఈ రెండు పార్టీలు కర్ణాటక అభివృద్ధికి అవరోధంగా తయారయ్యాయన్నారు. ప్రజలు వాటిని క్లీన్ బౌల్డ్ చేశారని, కాంగ్రెస్, జేడీఎస్ అవినీతి ప్రభుత్వం నుంచి బీజేపీ కర్ణాటక ప్రజలను కాపాడిందని చెప్పారు.
Read Also: Adah Sharma: సంచలనం సృష్టిస్తున్న ‘కేరళ’ అమ్మాయిల మిస్సింగ్ ‘స్టొరీ’…
అస్థిర ప్రభుత్వాలతో అభివృద్ధి జరగదని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో భారతదేశాన్ని ప్రపంచం పట్టించుకోలేదని, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని అన్నారు. బీజేపీని ఎన్నుకోవాలని కర్ణాటక నిర్ణయించిందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చాలా ముఖ్యమైందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, జేడీయూ ప్రభుత్వం హాయాంలో అభివృద్ధి మందగించిదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీకి 85 శాతం కమిషన్ తీసుకునే అలవాటు ఉందని, ఆ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదని, కేంద్ర నుంచి ఒక రూపాయి పంపిస్తే, క్షేత్రస్థాయికి 15 పైసలు మాత్రమే చేరుతాయని అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ బుజ్జగింపు రాజకీయలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందని, కేవలం బీజేపీ మాత్రమే అవినీతిపై చర్యలు తీసుకుంటుందని ప్రధాని తెలిపారు. రైతులకు కాంగ్రెస్ చేసిందేం లేని, వారికి హామీలు ఇచ్చి అమలు చేయలేదని, కానీ బీజేపీ మాత్రం రైతుల ఖాతాల్లో రూ.2.5 లక్షల కోట్ల రూపాయలను ఇచ్చిందని తెలిపారు. రైతుల అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని అన్నారు.