కర్ణాటకలో గతేడాది హిజాబ్ పోరాటం ఉధృతంగా సాగింది. ముస్లిం బాలికలు స్కూళ్లు, కాలేజీలకు హిజాబ్ ధరించి రావడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు చేశారు. కాలేజీలకు హిజాబ్ తో వచ్చే విద్యార్థినులపై దాడులకు దిగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఓ బాలిక మాత్రం వారిని ప్రతిఘటించింది. హిజాబ్ తోనే వచ్చి చదువుకుంటానని తేల్చిచెప్పేసింది. విద్యార్థుల రూపంలో ఉన్న అల్లరిమూకలు అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత కర్ణాటకలో హిజాబ్ పోరాటం హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ఏమీ తెలలేదు. ఆ లోపే కర్ణాటక ఎన్నికలు కూడా వచ్చేశాయి.
Also Read : GT vs MI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ముంబై ఇండియన్స్
అయితే అప్పట్లో హిజాబ్ ధరించడం కోసం అల్లరి మూకలతో ధైర్యంగా పోరాడి సోషల్ మీడియాతో పాటు అన్ని చోట్లా వైరల్ అయిన ఓ విద్యార్థిని ఇప్పుడు ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో సత్తా చాటింది. ఏకంగా టాపర్ గా నిలవడంతో పాటు చదువు కోసం తాను చేసిన పోరాటం వృథా కాలేదని నిరూపించింది. కర్ణాటకలో క్లాస్ 12 ఫలితాల్ని తాజాగా బోర్డు ప్రకటించింది. ఇందులో 600 మార్కులకు గానూ ఏకంగా 593 మార్కులు సాధించి సదరు హిజాబ్ బాలిక తబస్సుమ్ టాపర్ గా నిలిచింది.
Also Read : Harish Rao : బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టి రాజకీయ కక్ష సాధింపుకి పాల్పడుతున్నారు
తన హిజాబ్ కంటే విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది. హిజాబ్ నిషేదంపై నిర్ణయం వచ్చినప్పుడు, ఆ ఆదేశాలను పాటించమని తన తల్లిదండ్రులు ప్రోత్సహించారని తబస్సు్మ్ తెలిపింది. రెండు వారాలుగా కాలేజీకి వెళ్లలేదని, ఏం చేయాలో తోచక అయోమయంలో పడ్డానని తబస్సు్మ్ తెలిపింది. అయితే తన తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లామని ప్రోత్సహించారని తబస్సుమ్ పేర్కొంది. తనకు చదువు వస్తే భవిష్యత్తులో ఇలాంటి అన్యాయాలపై గళం విప్పగలను అని తబస్సుమ్ అంటుంది.