Karnataka: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఏకంగా 34 ఏళ్ల తరువాత భారీగా ఓట్లను, సీట్లను సంపాదించింది. మొత్తం 224 సీట్లలో 135 సీట్లను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే సీఎం అభ్యర్థిత్వం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. మాజీ సీఎం సిద్దరామయ్యతో పాటు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందా..? అనేది సస్పెన్స్ గా మారింది.
Congress: కర్ణాటక ఎన్నికలు ముగిసినా.. కాంగ్రెస్ భారీ విజయం సాధించినా.. ఇప్పటికే సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆదివారం సాయంత్రం బెంగళూర్ లోని షాంగ్రీల్లా హోటల్ కేంద్రంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కాంగ్రెస్ నేతలు జైరాంరమేష్, రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు సుశీల్ కుమార్ షిండే, దీపక్ బబారియా, జితేంద్ర సింగ్ అల్వార్ పరిశీలకులుగా ఉన్నారు.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ గెలుపుపై బీజేపీయేతర విపక్షాలు అభినందనలు తెలియజేస్తున్నారు. కొందరు విపక్షాల ఐక్యతకు ఇదే మంచి సమయం అని చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా అందులో చేరాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం ఈ విషయం దేశంపై ప్రభావం చూపించదని.. 2024 లోక్ సభ ఎన్నికలపై దీని ఎఫెక్ట్ ఉండదని, మళ్లీ వచ్చే ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు.
BJP: కర్ణాటక ఎన్నికల్లో కన్నడ ప్రజలు సంప్రదాయాన్ని కొనసాగించారు. దాదాపుగా గత మూడు దశాబ్ధాలుగా వరసగా ఏ పార్టీ కూడా రెండు సార్లు అధికారం ఏర్పాటు చేయలేదు. 1985 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. తాజాగా 2023 ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అయింది. బీజేపీ నుంచి అధికారాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో బీజేపీ 66 స్థానాలకు పరిమితం అయితే.. కాంగ్రెస్ ఏకంగా మ్యాజిక్ ఫిగర్ 113ని దాటేసి 135…
DK Shivakumar: కర్ణాటకలో భారీ విజయం నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికపై తర్జనభర్జన పడుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ రేసులో ఉన్నారు. అ
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఇదిలా ఉంటే గురువారం కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి, మంత్రి వర్గం ప్రమాణస్వీకారం ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అన్ని మిత్రపక్షాలకు ఆహ్వనాలు పంపించనుంది. కర్ణాటక మంత్రివర్గం ఒకటి రెండు రోజుల్లో ఖరారు అవుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
Kapil Sibal: కర్ణాటక అసెంబ్లీలో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇతర ఎన్డీయేతర ప్రతిపక్షాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాజ్యసభ ఎంపీ, మాజీ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సందేశం ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో ప్రజల మనుసులు గెలుచుకోవాలని కాంగ్రెస్ కు సూచించారు.
Congress: కర్ణాటక ఎన్నికల విజయంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్ గా భావించిన కర్ణాటకలో అధికారంలోకి వస్తుండటం కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాాలని కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి విజయాల కోసం ఎదురుచూస్తున్న హస్తం పార్టీ ఘన విజయం సాధించడంతో రానున్న ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలకు ఆ…
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఈ సాయంత్రం తన ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.