Siddaramaiah: సీఎల్పీ లీడర్ గా సిద్దరామయ్య ఎన్నిక.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddaramaiah: సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఈ రోజు ప్రకటించింది. ఢిల్లీ నుంచి ఇద్దరు నేతలు ఈ రోజు సాయంత్రం బెంగళూర్ చేరుకున్నారు. బెంగళూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దరామయ్యను తమనేతగా, సీఎల్పీ లీడర్ గా ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారు. సిద్దరామయ్య పేరును ఆర్వీ దేశ్‌పాండే, హెచ్‌కే పాటిల్, ఎంబీ పాటిల్, లక్ష్మీ హెబ్బాల్కర్ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేంతా ఏకగ్రవంగా ఎన్నుకున్నారు.
Read Also: IPL 2023: హైదరాబాద్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ.. 10 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..?
Also Read
ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ సభ్యుల బృందం గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి గవర్నర్ తో చర్చించారు. గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ ను కలిసేందుకు సిద్దరామయ్యతో పాటు డీకే శివకుమార్, ఇతర కీలక నేతలు రాజ్ భవన్ వెళ్లారు. మరోవైపు సిద్దరామయ్య ఇంటి ముందు ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే మాజీ సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై , సీఎంగా ఎన్నికైన సిద్దరామయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ పేరిట అధికార ప్రకటన వెలువడింది. సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ను ఉపముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు. వీరిద్దరితో పాటు మంత్రి మండలి ప్రమాణస్వీకారం మే 20 మధ్యాహ్నం 12.30 గంటలకు ఉండనుంది. బెంగళూర్ లోని కంఠీరవ స్టేడియంలో అట్టహాసంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
#Karnataka | Congress Legislative Party (CLP) meeting was held at the party office in Bengaluru today.
The CLP approved the name of Siddaramaiah as the CLP leader.
(Pictures: Karnataka Pradesh Congress Committee) pic.twitter.com/mmKBGTXz8W
— ANI (@ANI) May 18, 2023
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!