Karnataka : కర్ణాటకలో బీజేపీ పాలన ముగిసింది. మే 13న ముగిసిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో మే 13న జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 135 స్థానాలను గెలుచుకుంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో అవినీతి పాలన ముగిసిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం కర్నాటక అసెంబ్లీను గోమూత్రంతో శుభ్రం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కర్నాటక అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలోనే అవినీతి బీజేపీ పాలన ముగిసిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసెంబ్లీను గోమూత్రంతో శుభ్రపరిచారు.
Read Also:Bandi sanjay: వారికి మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
మే 20న ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ ఏడాది జనవరిలో అసెంబ్లీను గోమూత్రంతో ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. “అసెంబ్లీని శుభ్రపరచడానికి మేము కొంత డెటాల్ తో వస్తాం. శుద్ధి కోసం నా దగ్గర కొంత గోమూత్రం కూడా ఉంది..’ అని శివకుమార్ పేర్కొన్నారు. బీజేపీ పాలనలో అవినీతితో అసెంబ్లీ కలుషితమైందని శివకుమార్ ఆరోపించారు. సిద్ధరామయ్య రెండోసారి కర్ణాటక సీఎంగా, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లతో పాటు మరో ఎనిమిది మంది కాంగ్రెస్ నేతలు శనివారం కర్ణాటకలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Read Also:Sharath Babu: కమల్ కు ‘ఆస్కార్’ అన్నదే శరత్ అభిలాష!
#WATCH | Bengaluru: Congress workers sprinkle cow urine and perform Pooja at the State Assembly in Bengaluru. They said that they are 'purifying' Vidhana Soudha. pic.twitter.com/SWapoH7vOL
— ANI (@ANI) May 22, 2023