CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ‘హిందూ వ్యతిరేకి’ అంటూ అక్కడి బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కర్ణాటక బీజేపీ యూనిట్ సీఎం సిద్ధరామయ్య గుడిలోకి వెళ్లేందుకు నిరాకరించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇతర మంత్రులు, పూజారి లోపలకి ఆహ్వానించినప్పటికీ సీఎం గుడి ప్రవేశద్వారం వద్ద నిలబడి ఉన్న వీడియోని బీజేపీ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
31 ఏళ్ల నాటి రామాలయ ఆందోళనల్లో పాల్గొన్న వ్యక్తిని అరెస్ట్ చేయడంతో కర్ణాటకలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. సిద్దరామయ్య వీడియోనూ షేర్ చేస్తూ.. ‘‘ మైనారిటీలకు రూ. 10,000 కోట్లు ఇచ్చి, రామమందిరానికి రూ. 1 విరాళం ఇవ్వని ఎలక్షన్ హిందూ సిద్ధరామమ్య నిజస్వరూపం ఇదే’’అంటూ కామెంట్ చేసింది.
Read Also: Moblie Blast: జేబులో పేలిన సెల్‌ఫోన్.. యువకుడికి తీవ్రగాయాలు..
విజయపూర్ లోని దాబేరి గ్రామంలోని దేవీ వాగ్దేవిని దర్శించుకుంటున్న హిందూ వ్యతిరేకి సిద్ధరామయ్యకి శ్రీరాముడి అవతారంలా కనిపిస్తోంది. మసీదులు, దర్గాలకు వెళ్లి వారు ఇచ్చినవన్నీ సిద్దరామయ్య తీసుకుంటారు, వారికి డబ్బులు ఇస్తారు. దేశం మంచి కోసం దేవతని ప్రార్థించేందుకు కూడా ఆయనకు సమయం లేదు. హిందూ మతాన్ని, హిందూ దేవుళ్లను, హిందువులను చూస్తే మీకు ఎందుకు ఉదాసీనత..?’’ అంటూ బీజేపీ ట్వీట్ చేసింది.
దీనికి ముందు.. 1992 బాబ్రీ కూల్చివేత తర్వాత హుబ్బళ్లీ ప్రాంతంలో జరిగిన రామాలయ ఆందోళనల్లో పాల్గొన్న శ్రీకాంత్ పూజారి అనే వ్యక్తిని 31 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ సర్కార్ అరెస్ట్ చేశారు. అతడిని నిందితుడిగా పేర్కొంది. ఈ ఘటన కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య.. ఇది సాధారణ చర్యల్లో భాగమే అని, కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ సందర్భంగానే అతడిని అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ಅಲ್ಪಸಂಖ್ಯಾತರಿಗೆ 10 ಸಾವಿರ ಕೋಟಿ ನೀಡಿ, ರಾಮಮಂದಿರಕ್ಕೆ ಒಂದು ರೂ. ಸಹ ದೇಣಿಗೆ ನೀಡದ ಚುನಾವಣಾ ಹಿಂದೂ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯರವರ ಅಸಲಿ ಮುಖ ಇದು.
ವಿಜಯಪುರದ ದ್ಯಾಬೇರಿ ಗ್ರಾಮದ ವಾಗ್ದೇವಿ ದೇವಿಯ ದರ್ಶನವನ್ನು ಕಾಟಾಚಾರಕ್ಕೆ ಮಾಡಿದ ಹಿಂದೂ ವಿರೋಧಿ ಸಿದ್ದರಾಮಯ್ಯರವರು ಪ್ರಭು ಶ್ರೀರಾಮರ ಅಪರಾವತಾರವಂತೆ.
ಸಿಎಂ @siddaramaiah ಅವರೇ,… pic.twitter.com/wd8LRjBGb4
— BJP Karnataka (@BJP4Karnataka) January 3, 2024