Darshan vs Prabhas at Karnataka: రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సలార్’ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ప్రస్తుతం రూ. 750- 800 కోట్లకు చేరువలో ఉంది. లాంగ్ రన్‌లో మరో 1000 కోట్లు దక్కించుకోవచ్చునని ట్రేడ్ వర్గాల అంచనా. అన్ని భాషల్లోనూ అద్భుతంగా వసూళ్లు రాబడుతోన్న ‘సలార్’ ఒక చోట మాత్రం వెనుకబడడం హాట్ టాపిక్ అయింది. హిందీలో డంకీ తప్ప తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో అయితే సలార్‌కు దాదాపుగా పోటీ లేదు. కానీ కన్నడలో ఓ వారం తరువాత డిసెంబర్ 29న డీ బాస్ దర్శన్ కాటేరా అనే సినిమాతో వచ్చాడు. అప్పట్లో సలార్‌తో క్లాష్ విషయం మీద డీ బాస్ కామెంట్లు చేశాడు, సలార్ వస్తే రానివ్వండి దాన్ని చూసి మనం ఎందుకు భయపడాలి.. వాళ్లే మనల్నిచూసి భయపడాలి.. ఇది మన ఏరియా అంటూ డీ బాస్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
Shraddha Srinath: 18 ఏళ్ల వయస్సులోనే అతడి కోసం.. ఆ టాటూ వేయించుకున్నా
‘సలార్’ సినిమాను కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా తాను తీసిన ఫస్ట్ మూవీ ‘ఉగ్రమ్’కు ఫ్రీమేక్ అన్నట్టు సరిగ్గా రిలీజ్‌కి ఒక్క రోజు ముందు చెప్పాడు. మిగిలిన భాషల వారికి ‘ఉగ్రమ్’ సినిమా పెద్దగా తెలియదు కానీ కన్నడ ఫ్యాన్స్ మాత్రం చాలాసార్లు చూసేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో ‘సలార్’ వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ ‘సలార్’ రూ. 35.7 కోట్ల వసూళ్లు సాధించగా డిసెంబర్ 29న విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో దర్శన్ హీరోగా వచ్చిన ‘కాటేరా’కు కేవలం రెండు రోజుల్లో రూ. 37 కోట్లు రాబట్టి దూసుకుపోతోంది. అలా దేశమంతటా ‘సలార్’ ప్రభంజనం సృష్టిస్తుంటే.. కన్నడంలో మాత్రం పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయిందని డీ బాస్ చెప్పి మరీ హిట్ కొట్టాడు రా అంటున్నారు విశ్లేషకులు.
మేకర్స్ నుండి అధికారిక ప్రకటన ప్రకారం డీ బాస్ చిత్రం నాలుగు రోజుల్లో 77 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒకే భాషలో విడుదలైన ప్రాంతీయ చిత్రానికి ఇది మంచి నెంబర్. ప్రకటన తొలిరోజు ఈ సినిమా రూ.19.79 కోట్లు రాబట్టింది. శనివారం రూ. 17.35 కోట్ల సంపాదనతో స్వల్ప తగ్గుదల కనిపించగా, ఆదివారం అత్యధికంగా రూ. 20.94 కోట్లు, సోమవారం రూ. 18 కోట్లు వసూలు చేసి మొత్తం రూ. 77 కోట్లకు చేరుకుంది. ఈ సినిమా రూరల్, బి,సి సెంటర్లలో సలార్‌కి గట్టి పోటీనిస్తోంది. తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో దివంగత నిర్మాత రాము -నటి మాలాశ్రీల కుమార్తె ఆరాధన తొలిసారిగా హీరోయిన్ గా మారింది. జగపతి బాబు, శ్రుతి, కుమార్ గోవింద్, వైజనాథ్ బిరాదార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.