Karnataka Deputy CM: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేరళకు చెందిన జైహింద్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛానెల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఛానెల్‌లో పెట్టిన పెట్టుబడుల వివరాలను ఇవ్వాలని సీబీఐ అధికారులు నోటీసులు పంపించింది. అన్ని పత్రాలతో జనవరి 11న బెంగళూరులోని సెంట్రల్ ఏజెన్సీ ముందు హాజరు కావాలని ఛానెల్ మేనేజింగ్ డైరెక్టర్ బీఎస్ షిజును సీబీఐ ఆదేశించింది. ఈ సందర్భంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. వాళ్ల ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు.. అయితే కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని రాజకీయంగా నిర్మూలించేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన చెప్పారు.
Read Also: Seema Haider: సచిన్ బిడ్డకు తల్లి కాబోతున్న సీమా హైదర్..!
సీబీఐ అరెస్టు చేయాలనుకుంటే అందుకు రెడీగా ఉన్నామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఈ విషయంపై ఇప్పుడే వ్యాఖ్యానించదలుచుకోలేదు.. ఈ కేసులో నాకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది.. ప్రభుత్వం ఈ కేసును లోకాయుక్తకు అప్పగించినా సీబీఐ మాత్రం నోటీసులు జారీ చేస్తోంది.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 91 కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది అని కర్ణాటక ఉపముఖ్యమంత్రి అడిగారు. అయితే, పెట్టుబడులు శివకుమార్ భార్య ఉషా శివకుమార్‌లకు చెల్లించిన డివిడెండ్‌లు, షేర్ల లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు వివరాలను సమర్పించాలని జై హింద్ ఛానెల్‌ని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆదేశించింది.
Read Also: Andhrapradesh: మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం
ఇక, నోటీసుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. డీకే శివకుమార్ హోల్డింగ్స్ వివరాలు, అతని ఖాతా పుస్తకాలు, కాంట్రాక్ట్ నోట్లతో పాటు ఇతర వివరాలు, అన్ని షేర్ లావాదేవీల వివరాలను కంపెనీ అందించాలి అని జైహింత్ ఛానెల్ కు సీబీఐ తెలిపింది. 2020లో డీకే శివకుమార్‌పై సీబీఐ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయడం గమనార్హం. 2013 నుంచి 2018 మధ్య కాలంలో ఆయన మొత్తం 74 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు సంపాదించారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఇది అతని ఆదాయం కంటే ఎక్కువ అని తెలిపింది.