Karnataka: అయోధ్య రామ మందిరంపై పాకిస్థాన్ జెండా.. వ్యక్తి అరెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాష్ట్రంలోని గడగ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఫేక్ ఇమేజ్ సృష్టించి షేర్ చేయడంతో గజేంద్రగఢ్ పోలీసుల అతడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య శ్రీరామ మందిరంపై ఇస్లామిక్ జెండాలు ఎగురుతున్నట్లు ఫోటోలను మార్పింగ్ చేయడంతో.. పవిత్ర ఆలయ ప్రారంభోత్సవం రోజే లక్షలాది మంది హిందువుల మనోభావాలకు భంగం కలిగేలా చేసినందుకు పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Read Also: Rohit Sharma: ఐసీసీ ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ! జట్టులో సగం మనోళ్లే
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
అయితే, అయోధ్య రామ మందిరంపై పాకిస్థాన్ దేశానికి చెందిన జెండాను మార్పింగ్ చేసిన ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో హిందూ అనుకూల సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజుద్దీన్ దఫేదార్ అనే నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో హిందూ సమాజం ఆగ్రహానికి దారి తీసింది. అధికారులు వేగవంతమైన చర్యలు తీసుకున్నారు.
Read Also: YS Sharmila: కాంగ్రెస్ వైఎస్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందనటంలో వాస్తవం లేదు..
కాగా, గడగ్ జిల్లా పోలీసులు వెంటనే తాజుద్దీన్ దఫేదార్‌ను అరెస్టు చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి అయోధ్యపై పాకిస్థాన్ జెండా ఉన్న అభ్యంతరకరమైన పోస్ట్‌ను తొలగించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో పాటు మతపరమైన మనోభావాలను దెబ్బ తీసే విధంగా చేసినందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఇక, ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని పోలీసు శాఖ హామీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దాదాపు 500 సంవత్సరాల పోరాటం తర్వాత నిన్న ( సోమవారం ) శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..