Lok Sabha Elections 2024: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్ లో అర్ధరాత్రి నుంచి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం ఈ సోదాలు ముగిసాయి.
రేపు కరీంనగర్లో బీఆర్ఎస్ 'కథనభేరి' సభ నిర్వహించబోతుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభ వివరాలను తెలిపారు. రేపు సాయంత్రం 5:30 గంటలకి కరీంనగర్ లో కథనభేరి సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య కార్యక్రమాలన్నీ కరీంనగర్ నుండే కేసీఆర్ ప్రారంభిస్తారు.. అదే సెంటిమెంట్ తో పార్లమెంట్ ఎన్నికల కథనభేరి కూడా కరీంనగర్ నుండే ప్రారంభం అవుతోందని గంగుల కమలాకర్ తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వం పై…
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు.
Karimnagar Cylinder Blast: అగ్నిప్రమాదాలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంటాయి. రసాయనాల పేలుడు, షార్ట్ సర్య్కూట్ వంటి వివిధ కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.
Adlur Laxman Kumar: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది.
పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారులను భయాందోళనకు గురి చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల కోసం పోలీసులున్నారని వ్యాఖ్యానించిన హైకోర్టు.. పోలీసు విధులను గుర్తు చేసేలా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి సెర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎలుగుబంటును పట్టుకునేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎలుగుబంటికి ఆపరేషన్ టీం డాక్టర్ మత్తు ఇచ్చారు. దీంతో ఎలుగుబంటి సొమ్మసిల్లి పొలంలో పడిపోయింది. అనంతరం ఎలుగుబంటిని చికిత్స నిమిత్తం వరంగల్ కు తరలించారు.
Manakondur: కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మానకొండూరు మండల కేంద్రంలోని చెరువు కట్టపై సంచరించిన భల్లూకం హనుమాన్ దేవాలయం సమీపంలోని..
కరీంనగర్ లోని కస్తూర్భా కాలేజీలో దారుణం జరిగింది. కొత్తపల్లి మండలం శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అక్షిత మృత దేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు శాంతినగర్ కస్తూర్బా ప్రిన్సిపాల్ తరలించారు.
పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుండే పూరించబోతున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. అందులో భాగంగా ఈనెల 28న కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో 10 నుండి 20 వేల మంది బీజేపీ కార్యకర్తలతో పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించబోతున్నామన్నారు. ఈరోజు సాయంత్రం ఎస్సారార్ కళాశాలకు విచ్చేసిన బండి సంజయ్.. ఎల్లుండి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనానికి సంబంధించి…