కరీంనగర్ బీజేపీ లో విభేదాలు ముదిరుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఉమ్మడి జిల్లా నేతలు నగరంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ కు పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోని నేతలు హాజరు అయ్యారు.
మంత్రిగా తొలిసారి కరీంనగర్ వచ్చిన పొన్నం ప్రభాకర్ కి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అల్గునుర్ చౌరస్తా నుంచి తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్వాగత సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ.. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. నేను మంత్రిని అయినా కరీంనగర్ బిడ్డనే.. ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన సాధారణ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎంపీని చేసింది, మంత్రిని చేసిందన్నారు.…
రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో.. అలుగునుర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారయణ, మేడిపల్లి సత్యంకు భారీ గజమాలతో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదనంతరం పది సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్ధమైన బండి సంజయ్.. అందులో భాగంగా తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్.. ఆ సమావేశాల అనంతరం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. అందుకోసం నియోజకవర్గాల వారీగా విస్త్రతస్థాయి…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కమలం పార్టీ (బీజేపీ) ఖాతా తెరవలేదు. పోటి చేసిన ఇద్దరు ఎంపీలు పరాజయం పాలయ్యారు. బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సైతం ఓటమి చెందారు. దాంతో మూడు చోట్ల రెండవ స్థానంతో కమల నాథులు సరిపెట్టుకున్నారు. కరీంనగర్ నుంచి బరిలోకి దిగిన ఎంపీ, పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోరాడి ఓడారు. వరుసగా మూడు సార్లు గంగుల చేతిలో ఓడిపోవడం విశేషం. కోరుట్ల నుంచి…
Bandi Sanjay Release Note: రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ నియోజవర్గంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా బండి సంజయ్ సంచలన ప్రకటన ఇచ్చారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను సవాలు చేస్తూ బండి అనూహ్యంగా లేఖ విడుదల చేశారు. ‘గంగుల.. నీ సవాల్‌కు నేను రెడీ. భాగ్యలక్ష్మి వద్దకు కేసీఆర్‌ను రమ్మను. కరీంనగర్‌లో ఏ దేవాలయానికి రమ్మన్నా వచ్చేందుకు నేను సిద్ధం. డబ్బులు పంచలేదని…
కరీంనగర్ నగర అభివృద్ధి కొరకు స్మార్ట్ సిటీ నిధులపై చర్చకు సిద్ధమా అంటూ బండి సంజయ్‌కి తొడ కొట్టి సవాల్ విసిరారు మంత్రి గంగుల కమలాకర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ టవర్ సర్కిల్లో ప్రజలను ఉద్దేశించి గంగుల కమలాకర్ మాట్లాడారు. ఇప్పుడు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దోపిడీ దొంగ రేపు మీ వ్యాపార సంస్థలను వేధించి మామూలు వసూలు చేస్తాడని ఆరోపించారు.
కరీంనగర్ అశోక్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ఇదిగో నా అభివృద్ధి నివేదిక.. కరీంనగర్ ప్రగతి కోసం రూ. 9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చా. గంగుల… నువ్వు సాధించేదేమిటి?’ అని ప్రశ్నించారు. ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయ్.. కోచింగ్ లేక బీసీ స్టడీ సర్కిల్ వెక్కిరిస్తోంది.. తీగల వంతెన వీక్లీ డ్యాన్స్ క్లబ్‌లా మారింది.. అంటూ ఎద్దేవా చేశారు. కబ్జాలు,…
కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బుధవారం కరీంనగర్లో 59వ వార్డులో పర్యటించిన ఆయన బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండి సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలోని పెద్దపెద్ద సర్వేలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అని చెప్తున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ కార్డులో అభ్యర్థి సంతకం పార్టీ ప్రెసిడెంట్ సంతకాలు ఉంటాయని తెలిపారు. గ్యారెంటీ కార్డు అనేది అప్పు పత్రం…
కరీంనగర్ ఎన్నికల ప్రచారం మరింత ఆసక్తిగా మారాయి. గత మూడు రోజులుగా ప్రచారంలో గంగుల జోరు తగ్గిందా? అని అంతా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో గంగులకు మద్దతుగా కరీంనగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నేతల భార్యలు ప్రచారంలోకి దిగారు. గంగుల గెలుపు కోసం ఆయన సతీమణి రంగంలోకి దిగారు. ఆమెతో పాటు ప్రముఖ ముఖ్య నేతల భార్యలు కూడా బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. Also Read: IND vs AUS T20: విశాఖ వేదికగా తొలి…