కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి సెర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఒక్కరోజు పాటు స్థానికులను ఇబ్బందులకు గురిచేసిన ఎట్టకేలకు బంధించి తీసుకెళ్లారు. ఎలుగుబంటును పట్టుకునేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎలుగుబంటికి ఆపరేషన్ టీం డాక్టర్ ట్రాంక్విలైజర్ ద్వారా మత్తుమందు ఇచ్చారు. దీంతో ఎలుగుబంటి సొమ్మసిల్లి పొలంలో పడిపోయింది. అనంతరం ఎలుగుబంటిని చికిత్స నిమిత్తం వరంగల్ కు తరలించారు.
Read Also: Red Sandal Smugglers: రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగర్లు.. వాహనంతో ఢీకొట్టి కానిస్టేబుల్ హత్య
సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మానకొండూరు మండల కేంద్రంలోని చెరువు కట్టపై సంచరించిన భల్లూకం హనుమాన్ దేవాలయం సమీపంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. గమనించిన వీధికుక్కలు వెంబడించడంతో భయపడిన ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయి కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపైకి చేరుకుంది. అయితే అక్కడ రోడ్డుపై వాహనాలను చూసి కంగారుపడి పక్కనే ఉన్న చెట్టుపై ఎక్కింది. దీంతో కొందరు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Read Also: Gruha Jyothi Scheme: అద్దెకు ఉండేవారికి గుడ్‌న్యూస్.. కరెంట్ బిల్లుపై TSSPDCL క్లారిటీ..!