లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికల కమిషన్‌తో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఓటింగ్ హక్కుల వినియోగంపై సమాచారాన్ని ప్రచారం చేయడం కొనసాగిస్తున్నాయి. దానితో, రైడ్-షేరింగ్ యాప్ ‘రాపిడో’ రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి పనిచేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఓటర్లను ఉచితంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని ప్రకటించారు. మే 13న ఎన్నికల రోజున హైదరాబాద్‌తో సహా కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. తెలంగాణలోని 17…
CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికల ప్రచారం పార్టీల అగ్రనేతలు ఎంట్రీ ఇచ్చి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
BRS KTR: నేడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. వేములవాడ, మానకొండూర్, కరీంనగర్, చొప్పదండి నియోజక వర్గాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తైంది. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అభ్యర్థులు, వారి తరఫున హాజరైన ప్రతినిధుల ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
దేవుడి పేరుతో బండి సంజయ్ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని పొన్నం ప్రభాకర్ చెప్పారు. సీట్లు ఓట్ల కోసం తల్లిని కూడా బండి సంజయ్ అవమానించాడు.. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రసాదం స్కీమ్ ను వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలకి బండి సంజయ్ ఒక్క రూపాయి తీసుకు రాలేదన్నారు.
కరీంనగర్ లోని వికాస తరంగిణి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దర్శించుకున్నారు.
Ponnam Prabhakar: ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలోని కాంగ్రేస్ కార్యాలయంలో ఆయన దీక్ష చేపట్టనున్నారు. పదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో వైఫల్యాలపై దీక్ష చేపట్టనున్నట్లు పొన్నం ప్రకటించారు.
బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్‌కి మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. మంకమ్మ తోట నుంచి రాంనగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి గంగుల, ఎంపీ అభ్యర్థి వినోద్ పాల్గొన్నారు. కరీంనగర్‌లో ఎమ్మెల్యే హరీష్ రావు డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కరీంనగర్‌లో చదువుకున్న విద్యార్ధిని నేను.. జరిగిన అభివృద్ధి చుస్తే నా రెండు కళ్ళు సరిపోతలేవన్నారు. బీఆర్ఎస్కు…