Manakondur: కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మానకొండూరు మండల కేంద్రంలోని చెరువు కట్టపై సంచరించిన భల్లూకం హనుమాన్ దేవాలయం సమీపంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. గమనించిన వీధికుక్కలు వెంబడించడంతో భయపడిన ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయి కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపైకి చేరుకుంది. అయితే అక్కడ రోడ్డుపై వాహనాలను చూసి కంగారుపడి పక్కనే ఉన్న చెట్టుపై ఎక్కింది. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Read also: IND vs ENG: నేడే చివరి మూడు టెస్ట్‌లకు భారత జట్టు ప్రకటన.. అందరి కళ్లు విరాట్ కోహ్లీ ఎంట్రీపైనే!
ఎలుగుబంటిని చూసేందుకు బారులుతీరారు. దీంతో కొందరు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది రంగంలోకి దిగారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఎలుగుబంటిని చూసేందుకు వచ్చిన వారందిరితో రహదారి మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఎలుగుబంటి కిందికి దిగేందుకు ససేమిరా అనడంతో పకడ్బందీగా కిందికి దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రజల గుంపును చూసిన ఎలుగుబంటి కిందికి దిగేందుకు భయపడుతుండటంతో ప్రజలను అక్కడి నుంచి పంపించే పనిలోపడ్డారు. కాగా చెట్టుపైనే ఉన్న ఎలుగుబంటిని దించేందుకు వరంగల్ నుంచి వైల్డ్ లైఫ్ రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. ఎలుగుబంటిని బంధించేందుకు రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. కాసేపట్లో ట్రాంక్విలైజర్ ద్వారా మత్తు ఇవ్వనున్న అధికారులు.
Perni Nani: చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లపై పేర్ని నాని ఫైర్