Karimnagar: కరీంనగర్ లో కోడిపుంజు వేలం కథ ఆసక్తికరంగా మారింది. గత నాలుగు రోజులుగా కరీంనగర్ బస్టాండ్ రెండో డిపోలో ఓ కోడిపుంజు బందీగా ఉన్న విషయం తెలిసిందే.
కరీంనగర్లో కోడిపుంజు వేలం కథ ఆసక్తికరంగా మారింది. గత 4 రోజుల క్రితం ఓ ప్రయాణికుడు వరంగల్ నుండి వేములవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులో కోడి పుంజును మరిచిపోయాడు. అయితే దానిని.. కరీంనగర్ బస్టాండ్ కు రాగానే బస్సు డ్రైవర్ గుర్తించి సంచిలో ఉన్న కోడిపుంజును కంట్రోల్ కు అప్పగించాడు. అప్పటినుంచి ఆ పందెంకోడిని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఆర్టీసీ 2 డిపో ముందు అధికారులు తాడుతో కట్టి సంరక్షిస్తున్నారు.
Vinod Kumar: ఇంటిపేరు ఓకే విధంగా ఉంటే చుట్టాలుగా పరిగణించడం అనేది ఏ సంస్కృతి? అని బీజేపీ పై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. చుట్టాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి రికమండేషన్ చేసినానని వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు.
Lover Attack: ప్రేమ పేరుతో అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు యువకులు. చనువుగా ఉంటూ అదే ప్రేమనుకుని చివరకు ఆ యువతి నో చెప్పడంతో దాడులకు తెగపడుతున్నారు.
Karimnagar: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మానకొండుర్ నియోజకవర్గ స్థాయిలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తిమ్మపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో హాల్లో జరిగిన ఈ సమావేశంలో మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యానారాయణపై మండిపడ్డారు. Also Read:…
కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల పేరుతో అక్రమాలంటూ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మేయర్ సునీల్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ మంజూరు చేసిన 130 కోట్ల స్మార్ట్ సిటీ నిధులలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అంజేశారు. ఆయన వినతి పత్రాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ గతంలోని బిల్లులు జరగబోయే బిల్లులను ఆఫ్‌లైన్ ద్వారా విచారణ జరపాలని అధికారులను…
కరీంనగర్ లోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నగునూరులో సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో డిగ్రీ ఫస్ట్ ఈయర్ చదువుతున్న 19 ఏళ్ల సృజన సూసైడ్ చేసుకుంది. ఎవరు లేని సమయంలో హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని బలవన్మరణం చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని సృజన స్వస్థలం.. మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంగా గుర్తించారు.
రోడ్ల పై వాహనాలు వెళ్లేటప్పుడు అనుకోకుండా జంతువులు అడ్డు వస్తుంటాయి.. ఒక్కోసారి వాహనాల కిందపడి చనిపోతాయి.. కొన్నిసార్లు వాటివల్ల మనుషులకు ప్రమాదాలు జరుగుతుంటాయి.. ఇలాంటి ఘటనలను నిత్యం మనం చూస్తేనే ఉన్నాం.. తాజాగా తెలంగాణాలో మరో ఘటన జరిగింది.. ఓ కోతిని తప్పించబోయిన ఆటో డ్రైవర్ 13 మంది ప్రాణాలను రిస్క్ లో పెట్టాడు.. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.. మరో నలుగురి పరిస్థితి విషమంగా వుండగా మరికొందరు కూడా గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. ఇలా ఒక్క…
కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై మాజీ మేయర్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యతకు నిబంధనలకు నీళ్లు వదిలారు.. స్మార్ట్ సిటీ పనుల నిర్వహణకు, ప్రభుత్వానికి సంబంధం ఉండదు.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయాలు తీసుకుంటారు.
రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నియంతృత్వ ధోరణితో పాలన కొనసాగింది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమ లక్ష్యాలని నీరు కార్చారు.. కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారు.